‘అతడే శ్రీమన్నారాయణ’, ‘777 చార్లి’ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్లోనూ గుర్తింపు దక్కించుకున్నారు రక్షిత్ శెట్టి. ఆయన సినిమాలకు, ఆయనకు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఆయన సినిమా ఒకటి తెలుగులోకి రావడానికి సిద్ధమవుతోంది. తెలుగులో వరుస సినిమాలు చేస్తూ వచ్చిన… పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఇప్పుడు ఆ సినిమాను తీసుకొస్తోంది. ఇంతకీ ఆ సినిమా పేరేంటో చెప్పలేదు కదా… మొన్నీమధ్యనే మనం చదువుకున్న సినిమానే. రక్షిత్ శెట్టి హీరోగా హేమంత్.ఎం.రావు తెరకెక్కించిన చిత్రం ‘సప్త సాగరదాచె ఎల్లో: సైడ్ ఏ’.
రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను హీరో రక్షిత్ శెట్టినే నిర్మించారు. సెప్టెంబరు 1న కన్నడనాట విడుదలైన ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. సగటు కమర్షియల్ సినిమాకు దూరంగా రొమాంటిక్ డ్రామా జోనర్‌లో తెరకెక్కింది. హైదరాబాద్‌లో కన్నడ వెర్షన్ సినిమాకు మంచి స్పందనే వచ్చింది. దీంతో ఈ సినిమా తెలుగులో కూడా వస్తే బాగుండు అని కామెంట్స్ వినిపించాయి.
ఇప్పుడు ఆ సినిమాను (Sapta Sagaradaache Ello) తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ‘సప్త సాగరాలు దాటి’ అనే టైటిల్‌తో ఈ నెల 22న సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రకటించింది. ఈ సినిమాకు భారీ స్థాయిలో ప్రచారం చేయాలని టీమ్ ప్లాన్స్ వేస్తోంది కూడా. మరోవైపు కన్నడ నాట ‘సప్త సాగరదాచె ఎల్లో: సైడ్ ఏ’కి సీక్వెల్‌గా ‘సప్త సాగరదాచె ఎల్లో: సైడ్ బీ’ని కూడా సిద్ధం చేస్తున్నారు. దీంతో ఆ సినిమాను కూడా మన దగ్గర తీసుకొస్తారని టాక్.
ఇక ఈ సినిమా సంగతి చూస్తే… నగరంలో బడా వ్యాపారవేత్త శేఖర్ గౌడ (అవినాష్) దగ్గర మను (రక్షిత్ శెట్టి) కారు డ్రైవర్. అతను ప్రేమిస్తున్న ప్రియ (రుక్మిణి వసంత్)కు గాయని కావాలనేది టార్గెట్. అయితే యజమాని కొడుకు చేసిన తప్పు వల్ల డబ్బు కోసం ఆ నేరం తన మీద వేసుకుని మను జైలుకి వెళ్తాడు. అయితే మనుకి బెయిల్ రాకుండానే శేఖర్ చనిపోతాడు. ఈ లోగా ప్రియా లైఫ్ లో ఊహించని మలుపు వస్తుంది. అదేంటి అనేదే కథ.
బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!