Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

‘పెద్ది’ సినిమా తర్వాత రామ్‌చరణ్‌ – సుకుమార్‌ సినిమా ఉంటుంది అక్కడక్కడా సినిమా నిర్మాణ సంస్థ చెప్పడం, రామ్‌చరణ్‌ ఇంటర్వ్యూల్లో చెప్పడం, సుకుమార్‌ ఇప్పుడు ఆ సినిమా గురించి మాట్లాడను అని అనడం తప్పా.. రీసెంట్‌ టైమ్స్‌లో ఎక్కడా ఆ సినిమా గురించి ప్రస్తావనే లేదు. సినిమా ఆగిందని కొందరు, కాదు కాదు కథ సిద్ధమవుతోందని మరికొందరు చెప్పడం తప్ప.. అఫీషియల్‌ మాట, సోషల్‌ మీడియా పోస్టు లేదు.

Sara Arjun

ఎట్టకేలకు ఇప్పుడు చిత్ర నిర్మాణ సంస్థ ఓ పోస్టు ద్వారా క్లారిటీ ఇచ్చింది. రామ్‌చరణ్‌ 17వ సినిమా కోసం సుకుమార్‌ అండ్‌ టీమ్‌ సిద్ధమైంది అంటూ కొన్ని ఫొటోలను షేర్‌ చేసింది. అందులో సుకుమార్‌తోపాటు ఆయన దర్శకత్వ, రచయితల విభాగం అంతా ఉంది. దీంతో సినిమా కథ సిద్ధమైపోయింది అని టీమ్‌ చెప్పాలనుకుంటోంది. అలాగే రూమర్లు వచ్చినట్లుగానే త్వరలోనే సినిమాను లాంఛనంగా ప్రారంభిస్తారు అని కూడా చెప్పారు.

ఇప్పటికే సినిమాకు సంబంధించిన కాస్ట్‌ అండ్‌ క్రూను చిత్రబృందం ఎంపిక చేసే పనిలో ఉంది. అలా హీరోయిన్‌ విషయంలో చర్చ జరిగి, ఓ హీరోయిన్‌ను ఎంపిక చేశారు అని చెబుతున్నారు. ఆమెనే ‘ధురంధర్‌’ సినిమాలతో హీరోయిన్‌గా అదరగొట్టిన సారా అర్జున్‌. బాలనటిగా స్టార్‌గా వెలుగొందిన ఆమె ‘ధురంధర్‌’ సినిమాలతో స్టార్‌ హీరోయిన్‌ అయిపోయింది. ఇప్పుడు ఆమెనే కథానాయికగా చేస్తున్నారట. అంతేకాదు సినిమా ఓపెనింగ్‌కి ఆమె కూడా వస్తుందని టాక్‌.

సంగీత దర్శకుడి విషయంలో చర్చలు కొలిక్కి వచ్చి అనిరుధ్‌ రవిచంద్రన్‌ను ఎంపిక చేశారు అని ఇప్పటికే మీకు తెలుసు. మామూలుగా సుకుమార్‌ సినిమాలకు దేవిశ్రీ ప్రసాద్‌ ఉంటారు. కానీ ఆయన తొలిసారిగా హీరోగా నటిస్తూ, సంగీత దర్శకత్వం వహిస్తున్న ‘ఎల్లమ్మ’ సినిమా పనుల్లో బిజీగా ఉండటంతో.. ఈ సినిమాకు అందుబాటులో లేరని సమాచారం. అనిరుథ్‌ వైపు ఈ కారణంగానే సుకుమార్‌ అండ్‌ కో. చూస్తున్నారని టాక్‌. ఈ విషయంలోనూ దసరాకు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఆ రోజే సినిమా లాంఛనంగా ప్రారంభం.

 నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus