సర్దార్ సెన్సార్ డేట్.. !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కాజల్ జంటగా నటిస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రీకరణ కార్యక్రమాలు దాదాపు పూర్తి కావచ్చాయి. దాంతో ఈ చిత్రం ఏప్రిల్ 1 లేదా 2న సెన్సార్ కు వెళ్లనున్నట్లు సమాచారం. ప్రస్తుతం పవన్, కాజల్ మధ్య స్విట్జర్లాండ్ లో గీతాలను చిత్రీకరిస్తున్నారు. మార్చి 27 వరకు ఈ షెడ్యూల్ సాగనుండగా.. మార్చి 29 న చిత్రబృందం తిరిగి హైదరాబాద్ చేరుకోనుంది.

తెలుగులో ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తి కాగా.. హిందీలో డబ్బింగ్ కూడా దాదాపు పూర్తి కావచ్చినట్లు సమాచారం. సిట్జర్లాండ్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే మిగిలిన ఎడిటింగ్ వర్క్ కూడా పూర్తి చేసుకొని ఈ చిత్రం సెన్సార్ కు వెళ్లనుంది. సర్దార్ గబ్బర్ సింగ్ ను తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో ఏప్రిల్ 8న విడుదల కానుంది

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus