గబ్బర్ సింగ్ సినిమా పవన్ కరియర్ కు టర్నింగ్ పాయంట్ గా నిలవడమే కాకుండా సరికొత్త రికార్డులు సృష్టించి అప్పట్లో పవన్ కరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక ఆ సినిమా సీక్వెల్ గా వచ్చి ప్రభంజనం సృష్టిస్తుంది అని అనుకున్న సర్దార్ గబ్బర్ సింగ్ పరిస్థితి మరింత విషమంగా మారి మరింత ఇబ్బందుల్లో పడింది. నమ్ముకున్న వారినే కాదు, సినిమా కొనుక్కున్న వారిని కూడా పూర్తిగా ముంచేసి దిక్కు లేకుండా చేసింది ఈ సినిమా. ఇదిలా ఉంటే సినిమా ఎలాగో అస్సాం అయిపోయింది, మరి ఇంతటి ఘోర పరాజయాన్ని తప్పించడానికి, ప్రజల ఆలోచనలను మార్చడానికి ఏం చేద్దాం అన్న ఆలోచనతో పవన్ మరియు అతని శిబిరం సరికొత్త చర్యలు మొదలు పెట్టనున్నారు. 2019లో ప్రజల్లోకి వస్తా…ప్రజలతోనే ఉంటా అంటున్న జనసేన అధినేత పవన్ సర్దార్ దెబ్బను మరచిపోయేలా త్వరలో సరికొత్త తరహాలో పాదయాత్రలు – బస్సు యాత్రలు – బహిరంగ సభలలో పాల్గొంటూ జనంతో మమేకం అయ్యేలా ఎత్తుగడలు రూపొందించినట్లు సమాచారం. సినీ సర్కిల్స్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, 2019లో అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగి తన సత్తా ఏంటో చూపించాలి అని ఉవ్విళ్ళూరుతున్న పవన్, జనసేన ను ప్రజలకు మరింత దగ్గర చెయ్యాలి అన్న ఆలోచనతో ఈ పధకం రచించినట్లు తెలుస్తుంది. మరి సినిమాల పరంగా పవన్ ఎంత పవర్ స్టార్ అయినప్పటికీ ఒక్కటంటే ఒక్క పాత్ర….”ఈ పాత్ర పవన్ తప్పితే” మరెవ్వరూ చెయ్యలేరు అన్న పాత్ర ఒక్కటి కూడా పవన్ కరియర్ లో లేకపోవడం, అంతేకాకుండా ఆవేశానికి కేర్ ఆఫ్ అడ్రెస్ లాంటి పవన్ స్పీచ్ ఎలాంటి ఫలితాలను ఇస్తాయో చూడాలి.