కార్తి హీరోగా ‘అభిమన్యుడు’ ఫేమ్ పి ఎస్ మిత్రన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సర్దార్’.ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మించిన ఈ మూవీ స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందింది. రాశి ఖన్నా , రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 21న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కాబోతుంది. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో కింగ్ అక్కినేని నాగార్జున తన ‘అన్నపూర్ణ స్టూడియోస్’ ద్వారా విడుదల చేస్తున్నారు.
దీంతో ‘సర్దార్’ మూవీకి థియేట్రికల్ బిజినెస్ బాగానే జరిగింది. ఒకసారి వాటి వివరాలను గమనిస్తే :
నైజాం
1.90 cr
సీడెడ్
0.73 cr
ఉత్తరాంధ్ర
0.79 cr
ఈస్ట్+వెస్ట్
0.45 cr
కృష్ణా + గుంటూరు
0.57 cr
నెల్లూరు
0.15 cr
ఏపి+ తెలంగాణ
4.59 cr
‘సర్దార్’ చిత్రానికి తెలుగు రాష్ట్రల్లో రూ.4.59 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.4.9 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. పాజిటివ్ టాక్ వస్తేనే తప్ప అది అంత ఈజీ కాదు అనే చెప్పాలి. ఎందుకంటే పోటీగా ‘ప్రిన్స్’ ‘ఓరి దేవుడా’ ‘జిన్నా’ వంటి చిత్రాలు విడుదల కాబోతున్నాయి.
మరోపక్క ‘కాంతారా’ చిత్రం బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ గా రన్ అవుతూ భారీ కలెక్షన్లు దిశగా దూసుకుపోతుంది. కార్తి చిత్రాల్లో ‘ఖైదీ’ రూ.7 కోట్ల వరకు షేర్ ను రాబట్టింది. కానీ ఆ చిత్రం బ్లాక్ బస్టర్ టాక్ ను రాబట్టుకుంది కాబట్టి అంత కలెక్ట్ చేయగలిగింది.