పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మోస్ట్ అవైటెడ్ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్. దాదాపుగా ఎన్నో భారీ డిజాస్టర్స్ తరువాత పవన్ కల్యాణ్ కు తొలకరి వానలాగా వచ్చి హిట్ ను అందించింది ‘గబ్బర్ సింగ్’ అయితే ఆ గబ్బర్ సింగ్ కు సీక్వెల్ గా వచ్చిన చిత్రం ఈ సర్దార్ గబ్బర్ సింగ్. పవన్ అభిమానులు ఎన్నాళ్ళగానో ఎదురు చూస్తున్న ఈ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్దం అవుతున్న క్రమంలో ఈ సినిమా పబ్లిసిటీ విషయంలో పవన్ కల్యాణ్ హడావిడి చేస్తున్నాడు. ఈ సినిమాను బాహుబలి రికార్డ్స్ ను కొల్లగొట్టె సినిమాగా ఊహించుకుంటున్న పవన్ సరికొత్త పబ్లిసిటీ చేస్తున్నాడు. రాజమౌళి బాహుబలి విషయంలో ఒక్కొక్క పాత్రను ఒక్కో బుక్ రూపంలో విడుదల చేసి మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. అయితే పవన్ సర్దార్ ను కూడా అలాగే డిఫరెంట్ గా ప్రమోట్ చెయ్యాలనే ఆలోచనతో రతన్ పూర్ గ్రామం ఎలా పుట్టింది, ఆ ఊరు చరిత్ర ఏంటి , అక్కడి నిధులూ, నిక్షేపాలూ , జనాభా లెక్కలూ అంటూ వర్ణించే ఒక డైరీ ని అన్ని మీడియా సంస్థలకూ పంపించారు సర్దార్ గబ్బర్ సింగ్ డైరెక్టర్ లు. వినడానికి ఎంత విడ్డూరంగా ఉందో కదా. నిజమే ఈ మాట సాక్షాత్తూ పవన్ ఫ్యాన్స్ కూడా అంటున్నారు. ఈ సినిమా ఎదో రుద్రమ దేవి లాగా బాహుబలి లాగా ఫీల్ అవుతున్నాడు మన పవర్ స్టార్ అని. అంతేకాకుండా అవేవో స్టోరీ బోర్డ్స్ అంటూ కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే…స్టోరీ బోర్డ్స్ అనేవి తెలుగు వారికి కొత్త ఏమీ కాదు. దివంగత డైరెక్టర్ బాపూ తన ప్రతీ సినిమా కి తానే స్టోరీ బోర్డు వేసుకునేవారు. ఇంకా చాలా మంది స్టోరీ బోర్డు లు వేస్తున్నారు ఇప్పుడు. మరి అలాంటి పాత ట్రెండ్ ను ఏదో పవన్ కొత్తగా స్టార్ట్ చేసినట్లు చూపించి ఈ సినిమాపై మరింత హైప్ పెంచి చివరకు సినిమాను ఇబ్బందుల్లో పెడతారేమో అని పాపం అభిమానులు దిగులు చెందుతున్నారు. ఏది ఏమైనా…ఇంత హడావిడి అవసరం లేదు ఎందుకంటే…ఇది ఫక్తు కమర్షియల్ డ్రామా అంతే.