ఈసారైనా మహేష్ హిట్ కొడతాడా..?

  • November 20, 2020 / 05:59 PM IST

టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా ఎదిగిన మహేష్ బాబు చాలా కాలంగా తమిళ మార్కెట్ పై కన్నేశాడు. ఈ క్రమంలో చాలా ప్రయత్నాలు చేశారు. మురుగదాస్ లాంటి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ తో సినిమా సెట్ చేసుకొని తెలుగుతో పాటు, తమిళంలో కూడా చేశాడు. ఈ సినిమా కంటే ముందు మహేష్ నటించిన కొన్ని సినిమాలను పెద్ద స్థాయిలోనే తమిళంలో రిలీజ్ చేశారు. కానీ ‘స్పైడర్’తో సహా ఏ సినిమా కూడా అక్కడ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. దీంతో మహేష్ కోలీవుడ్ మార్కెట్ గురించి ఆలోచించడం మానేసి.. తెలుగుపైనే దృష్టి పెట్టాడు.

ఇప్పుడు మహేష్ కి ఇంట్రెస్ట్ లేకపోయినా.. ఆయన నటించిన కొత్త సినిమాను తమిళంలోకి తీసుకెళ్లే ప్రయత్నాలు జరిగాయి. ఈ ఏడాది సంక్రాంతికి మహేష్ నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా రిలీజైన సంగతి తెలిసిందే. ఈ సినిమా మహేష్ కెరీర్ లోనే హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని ‘ఇవనక్కు సరియాన ఆలిల్లై’ అనే పేరుతో తమిళంలోకి డబ్ చేశారు. అన్ లాక్ లో భాగంగా ఇటీవల తమిళంలో థియేటర్లు తెరుచుకోగా.. ఇప్పుడు మహేష్ డబ్బింగ్ సినిమాను స్ట్రెయిట్ సినిమా మాదిరి అక్కడ రిలీజ్ చేస్తున్నారు.

ప్రస్తుతం తమిళంలో కూడా కొత్త సినిమాలను రిలీజ్ చేసే పరిస్థితి కనిపించడం లేదు. అప్పటివరకు థియేటర్లను నడిపించాలంటే కాస్త పేరున్న సినిమాలు కావాల్సిందే. అందుకే మహేష్ సినిమాను డబ్ చేసి రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు. కోలీవుడ్ స్టార్ హీరోల సినిమాల రేంజ్ లో మహేష్ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. మరి ఈ సినిమాతోనైనా మహేష్ కోలీవుడ్ లో సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి!

Most Recommended Video

ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?
ఈ 12 మంది ఆర్టిస్ట్ ల కెరీర్.. షార్ట్ ఫిలిమ్స్ ద్వారానే మొదలయ్యింది..!
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus