‘సరిలేరు నీకెవ్వరు’ కి పాజిటివ్ రిపోర్ట్స్?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్ సుంకర, దిల్ రాజు కలిసి నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది. నిన్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాల్ని పూర్తి చేసుకుంది. ఎటువంటి కట్స్ లేకుండా సెన్సార్ బోర్డు వారు ఈ చిత్రానికి యూ/ఎ సర్టిఫికెట్ ను జారీ చేశారు. అంతేకాదు వారు ఈ చిత్రానికి పాజిటివ్ రిపోర్ట్స్ కూడా ఇవ్వడం విశేషం. కచ్చితంగా ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ చిత్రం రన్ టైం 2 గంటల 47 నిముషాలు అని తెలుస్తోంది. ఫస్ట్ హాఫ్ లో వచ్చే 15 నిమిషాల మిలిటరీ ఎపిసోడ్, మరియు 35 నిముషాలు పాటు వచ్చే ట్రైన్ ఎపిసోడ్ ఆకట్టుకునే విధంగా ఉందట. ఇక సెకండ్ హాఫ్ లో మహేష్ అభిమానులకి కావాల్సిన మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయట. అలాగే కుటుంబ ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకునే ఎలిమెంట్స్ కూడా ఉన్నాయని తెలుస్తుంది. సంక్రాంతికి పర్ఫెక్ట్ సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’ అనే రిపోర్ట్స్ అయితే సెన్సార్ వారు ఇచ్చేసారు. అయితే నిడివి అలాగే కొంచెం రొటీన్ కథ కొంచెం మైనస్ పాయింట్లుగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఈ చిత్రాన్ని మొదట జనవరి 12 న రిలీజ్ అన్నారు.. ఆ తరువాత జనవరి 11న అన్నారు. కానీ సెన్సార్ పూర్తయిన తరువాత విడుదల చేసిన పోస్టర్ లో మాత్రం రిలీజ్ డేట్ వేయలేదు. ఒక వేళ రిలీజ్ డేట్ మార్చే ఆలోచనలు చిత్ర బృందం చేస్తుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి ఏమవుతుందో చూద్దాం.

అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
తూటా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus