అక్కడ ‘ఆగడు’ సినిమాలా ఇది కూడా సూపర్ హిట్ అవుతుందేమో..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు తమిళంలో కూడా మంచి మార్కెట్ ఉంది. తక్కువ రేట్ కు డబ్బింగ్ చేసినప్పటికీ.. అక్కడ కోట్ల రూపాయలు వసూల్ చేస్తుంటాయి మహేష్ బాబు సినిమాలు. తెలుగు వెర్షన్ లకు కూడా అదే స్థాయిలో కలెక్షన్లు వస్తుంటాయి.సరే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే.. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అనీల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా నటించింది.

చాలా రోజుల తర్వాత మహేష్ లోని మాస్ యాంగిల్ ను బయటపెట్టిన చిత్రం ఇది. ఇప్పుడు ఈ చిత్రాన్ని.. అతిత్వరలో తమిళ్ లో విడుదల చేయబోతున్నారట. తమిళ్ డబ్ వెర్షన్ నే విడుదల చేస్తారని తెలుస్తుంది.లాక్ డౌన్ తరువాత థియేటర్లు తెరుచుకోనున్న తరుణంలో పాత సినిమాలను ప్రదర్శించాలని అక్కడి థియేటర్ యాజమాన్యం డిసైడ్ అయ్యిందట.’సరిలేరు నీకెవ్వరు’ తెలుగు వెర్షన్ కు చెన్నై లో కూడా మంచి కలెక్షన్లు వచ్చాయి. గతంలో మహేష్ ఫ్లాప్ సినిమా అయిన ‘ఆగడు’ ను తమిళ్ లో డబ్ చేసి విడుదల చెయ్యగా..

అక్కడ మంచి కలెక్షన్లను సాధించింది. ఇప్పుడు ఈ చిత్రం కూడా అలాగే హిట్ అవుతుందేమో చూడాలి. ‘సరిలేరు’ ని అక్కడ 150 నుండి 200 స్క్రీన్స్ లో విడుదల చేయబోతున్నట్టు సమాచారం.

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus