ట్రైలర్ లోనే సినిమా చూపించేసిన మహేష్.. !

భారీ అంచనాల మధ్య విడుదల అవుతున్న మహేష్ సంక్రాంతి మూవీ సరిలేరు నేకెవ్వరు ట్రైలర్ నిన్న విడుదలైంది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసిన సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా విడుదలైన ట్రైలర్ మహేష్ లోని కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. అటు కామెడీ ఇటు సీరియస్ యాక్షన్ తో కూడిన ఒక పర్ఫెక్ట్ ట్రైలర్ ని దర్శకుడు అనిల్ రావిపూడి కట్ చేశారు. ఐతే ట్రైలర్ లోనే సినిమా ఏమిటో చూపించేశాడు ఈ దర్శకుడు. మొదటి సగంలో నాన్ స్టాప్ కామెడీ, రెండవ సగంలో హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతో సినిమా నడిపించినట్లు తెలుస్తుంది.

ఆర్మీ మేజర్ మహేష్ సెలవులకై ఇంటికి వస్తున్న సమయంలో వచ్చే ట్రైన్ ఎపిసోడ్ లో రష్మిక మరియు ఆమె ఫ్యామిలీతో హిలేరియస్ కామెడీ పండించినట్లు తెలుస్తుంది. ‘నీకు అర్థం అవుతుందా…? ‘, నెవర్ బిఫోర్… ఎవర్ ఆఫ్టర్.. ‘ అనే రెండు క్యాచి డైలాగ్స్ ని కూడా కామెడీ కోసం వాడినట్లున్నారు. ఈ ట్రైన్ ఎపిసోడ్ దాదాపు అరగంట ఉంటుందని సమాచారం.

ఇక సినిమా సీరియస్ స్టోరీ మొత్తం విజయ శాంతి చుట్టూ తిరుగుతుందని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది.నీతిని, నిజాన్ని గట్టిగా నమ్మే కాలేజీ ప్రొఫెసర్ కి దుర్మార్గపు మంత్రి అయిన ప్రకాష్ రాజ్ కి జరిగే పోరులో విజయ శాంతి కి మహేష్ అండగా నిలబడతాడు. అసలు ఆర్మీ మేజర్ మహేష్, కాలేజీ ప్రొఫెసర్ విజయశాంతి కి సహాయం ఎందుకు చేశాడు..వారిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏమిటీ అనేది ఈ మూవీలోని అసలు ట్విస్ట్ అని చెప్పవచ్చు. ఐతే పెద్ద పండుగకు వస్తున్న సరైన చిత్రంగా సరిలేరు నీకెవ్వరు అని తెలుస్తుంది. థియేటర్ లో ఫ్యాన్స్ కి మహేష్ పూనకాలు తెప్పించడం ఖాయం.


అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
తూటా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus