మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ‘సర్కారు వారి పాట’ చిత్రం మే 12న విడుదలై విజయవంతంగా 20 రోజులు చేసుకుంది. పరశురామ్(బుజ్జి) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్’, ’14 రీల్స్ ప్లస్’, ‘జి.ఎం.బి ఎంటర్టైన్మెంట్’ సంస్థలు కలిసి నిర్మించాయి.మొదటి షోతోనే మిక్స్డ్ టాక్ ను ముటకట్టుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం ఈ మూవీ పర్వాలేదు అనిపించింది.20 వ రోజున కూడా ఈ మూవీ డీసెంట్ గా కలెక్ట్ చేసింది.
అయితే బ్రేక్ ఈవెన్ కు ఈ మూవీ ఇంకా పెద్ద టార్గెట్ నే ఛేజ్ చేయాల్సి ఉంది. ఒకసారి ‘సర్కారు వారి పాట’ 20 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం | 34.75 cr |
సీడెడ్ | 12.01 cr |
ఉత్తరాంధ్ర | 12.38 cr |
ఈస్ట్ | 8.90 cr |
వెస్ట్ | 5.60 cr |
గుంటూరు | 8.56 cr |
కృష్ణా | 6.26 cr |
నెల్లూరు | 3.66 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 92.12 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 6.87 cr |
ఓవర్సీస్ | 12.60 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 111.59 cr |
‘సర్కారు వారి పాట’ చిత్రానికి రూ.120 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే రూ.121 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 20 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.111.80 కోట్ల షేర్ ను రాబట్టింది. నెగిటివ్ టాక్ తో ఇలా కలెక్ట్ చేయడం అంటే చిన్న విషయం కాదు. కానీ బ్రేక్ ఈవెన్ కు ఈ మూవీ ఇంకా రూ.9.20 కోట్ల షేర్ ను రాబట్టాలి.అది అసాధ్యమే. కానీ ఉన్నంతలో ఈ మూవీ డీసెంట్ గా పెర్ఫార్మ్ చేస్తుండడం విశేషం.
Most Recommended Video
పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!