Sarkaru Vaari Paata: మరో రికార్డ్ సాధించిన సూపర్ స్టార్!

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట మినహా మరే సినిమాలో నటించడం లేదనే సంగతి తెలిసిందే. మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ షూటింగ్ ఇప్పటికే మొదలు కావాల్సి ఉన్నా సర్కారు వారి పాట షూటింగ్ ను పూర్తి చేసి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనాలని మహేష్ భావిస్తున్నారని తెలుస్తోంది. సర్కారు వారి పాటలో మహేష్ కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తుండగా త్రివిక్రమ్ సినిమాలో మాత్రం పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు.

మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా ద్వారా మహేష్ ఖాతాలో మరో అరుదైన ఘనత చేరింది. టాప్ మోస్ట్ ట్వీటెడ్ హ్యాష్ ట్యాగ్ మూవీలలో సర్కారు వారి పాట సినిమా కూడా ఒక సినిమాగా నిలిచింది. ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు టాప్ మోస్ట్ ట్వీటెడ్ హ్యాష్ ట్యాగ్ లకు సంబంధించిన జాబితాలో అజిత్ నటిస్తున్న వాలిమై తొలి స్థానంలో నిలవగా విజయ్ నటించిన మాస్టర్ రెండో స్థానంలో నిలిచింది.

టాప్ 10 జాబితాలో తెలుగు నుంచి రెండు సినిమాలకు మాత్రమే చోటు దక్కింది. టాప్ 3 స్థానంలో మహేష్ హీరోగా తెరకెక్కిన సర్కారు వారి పాట ఉండగా టాప్ 10 పొజిషన్ లో వకీల్ సాబ్ సినిమా ఉంది. వచ్చే ఏడాది జనవరి 13వ తేదీన సర్కారు వారి పాట సినిమా రిలీజ్ కానుంది. సర్కారు వారి పాట రిలీజయ్యే సమయానికి ఇంకెన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది. ఇప్పటికే విడుదలైన సర్కారు వారి పాట టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. మహేష్ ఈ మూవీ కోసం తన లుక్ ను పూర్తిగా మార్చుకున్నారు.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus