Sarkaru Vaari Paata: మహేష్ మూవీ గురించి క్లారిటీ వచ్చేది ఆ రోజేనా?

మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమా 2022 సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజ్ కావాల్సి ఉండగా ఆర్ఆర్ఆర్ సంక్రాంతికి రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ డేట్ మారే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే దీపావళి కానుకగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుందని తెలుస్తోంది. సర్కారు వారి పాట మేకర్స్ ప్రమోషన్స్ విషయంలో వేగం పెంచాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం స్పెయిన్ లోని అందమైన లొకేషన్లలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోందని సమాచారం. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా క్లాస్, మాస్ అనే తేడాల్లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఈ సినిమాలోని సాంగ్స్ ఉండనున్నాయని తెలుస్తోంది. గీతా గోవిందం సినిమాతో ఇండస్ట్రీ హిట్ సాధించిన పరశురామ్ మహేష్ తో ఆ సినిమాను మించిన హిట్ సాధించాలని భావిస్తున్నారు. మహేష్ బాబు గత మూడు సినిమాలు హిట్ కావడంతో సర్కారు వారి పాట సినిమాకు భారీస్థాయిలో బిజినెస్ జరుగుతోంది.

ఇప్పటికే రిలీజైన సర్కారు వారి పాట టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కీర్తి సురేష్ సైతం ఈ సినిమాతో సక్సెస్ సాధించాల్సి ఉంది. దీపావళి రోజునే ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus