Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట మేకర్స్ జాగ్రత్త పడాల్సిందేనా?

మహేష్, కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా నటించిన సర్కారు వారి పాట సినిమా తొలిరోజు నుంచి రికార్డు స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటోంది. బాక్సాఫీస్ వద్ద మరే సినిమా నుంచి పోటీ లేకపోవడంతో సర్కారు వారి పాట మూవీ జోరు కొనసాగుతోంది. గురువారం సర్కారు వారి పాట సినిమా విడుదల కావడంతో లాంగ్ వీకెండ్ ను ఈ సినిమా సద్వినియోగం చేసుకుంటుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే సర్కారు వారి పాట మండే బుకింగ్స్ ను పరిశీలిస్తే హైదరాబాద్ లోని పలు ప్రముఖ థియేటర్లలో మినహా ఇతర థియేటర్లలో ఈ సినిమా బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు.

అయితే ఆన్ లైన్ లో బుకింగ్స్ చెప్పుకోదగ్గ స్థాయిలో లేకపోయినా ఆఫ్ లైన్ లో మాత్రం బుకింగ్స్ బాగానే ఉండవచ్చని ఫ్యాన్స్ భావిస్తున్నారు. వీక్ డేస్ అయినా చాలామంది స్టూడెంట్స్ కు సమ్మర్ హాలిడేస్ కావడంతో ఈ సినిమాకు కలిసొస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా బుకింగ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. సర్కారు వారి పాట నిర్మాతలు ప్రమోషన్స్ విషయంలో మరింత వేగం పెంచితే ఈ సినిమాకు ప్లస్ అవుతుంది.

సర్కారు వారి పాట మండే కలెక్షన్లలో డ్రాప్ కనిపించడం ఖాయమని అయితే డ్రాప్ ఏ మేరకు ఉంటుందనే విషయానికి సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. అయితే సెకండ్ వీకెండ్ ను కూడా ఈ సినిమా సద్వినియోగం చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎఫ్3 సినిమా విడుదలయ్యే వరకు సర్కారు వారి పాటకు బాక్సాఫీస్ వద్ద పోటీ లేదు. ఓటీటీలో కూడా ఈ సినిమా ఆలస్యంగానే స్ట్రీమింగ్ కానుందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా ఓటీటీ హక్కులను కొనుగోలు చేసింది. రిలీజ్ రోజున ఈ సినిమాకు వచ్చిన నెగిటివ్ టాక్ ను చూసి కంగారు పడిన అభిమానులు ప్రస్తుతం సర్కారు వారి పాట రిజల్ట్ విషయంలో సంతృప్తితో ఉన్నారు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహేష్ బాబు 26 సినిమాలు.. మరియు వాటి బాక్సాఫీస్ కలెక్షన్లు..!
‘భద్ర’ టు ‘అఖండ’.. బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాల కలెక్షన్లు..!
‘దూకుడు’ టు ‘సర్కారు వారి పాట’.. ఓవర్సీస్ లో మహేష్ బాబు 1 మిలియన్ మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus