Mahesh Babu: మహేష్ బాబు మూవీపై ఈ ప్రచారం నిజమేనా?

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్లకు భారీ బడ్జెట్ సినిమాల డిజిటల్ హక్కులు వరంగా మారాయి. అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ , ​ఆహా, జీ5, సోనీ లివ్, స్పార్క్, మరికొన్ని ఓటీటీలు టాలీవుడ్ సినిమాల హక్కులను భారీ మొత్తానికి కొనుగోలు చేస్తున్నాయి. కొన్ని పెద్ద సినిమాలు విడుదలైన 50 రోజుల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ కానుండగా కొన్ని పెద్ద సినిమాలు మాత్రం రిలీజైన మూడు, నాలుగు వారాలకే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి.

గతేడాది డిసెంబర్ నెలలో విడుదలైన అల్లు అర్జున్ పుష్ప మూవీ మూడు వారాలకే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కావడంతో బన్నీ అభిమానులు షాకయ్యారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు పుష్ప ఓటీటీ ఒప్పందం విషయంలో తొందరపడ్డారని కామెంట్లు వినిపించాయి. అయితే గతంలో ఆర్ఆర్ఆర్ మూవీ జనవరి 7వ తేదీకి షెడ్యూల్ కావడంతో పుష్ప మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారని మరి కొందరు అభిప్రాయపడ్డారు. పుష్ప సినిమాను నిర్మించిన బ్యానర్ పైనే సర్కారు వారి పాట సినిమా తెరకెక్కుతోంది.

సర్కారు వారి పాట ఎప్పుడు విడుదలైనా ఈ సినిమా రిలీజైన 30 రోజుల్లో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. మేకర్స్ ఈ వార్తల గురించి స్పందించి క్లారిటీ ఇస్తే బాగుంటుందని మహేష్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అమెజాన్ ప్రైమ్ సర్కారు వారి పాట డిజిటల్ హక్కులను కొనుగోలు చేసింది. సర్కారు వారి పాట రిలీజైన 30 రోజుల లోపు ఓటీటీలో అందుబాటులోకి వస్తే ఈ సినిమా థియేట్రికల్ కలెక్షన్లపై ఆ ఎఫెక్ట్ పడే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

ఫేవరెట్ హీరోల సినిమాలు తక్కువ సమయంలోనే ఓటీటీలో అందుబాటులోకి రావడం ఫ్యాన్స్ కు సైతం నచ్చడం లేదు. మరోవైపు ఈ సినిమా నుంచి ఈ నెల 14వ తేదీన ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుంది. పరశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus