Mahesh Babu: మహేష్ ఖాతాలో చేరిన మరో రికార్డ్!

సూపర్ స్టార్ మహేష్ బాబు తన సినీ కెరీర్ లో ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రీ లుక్ పోస్టర్ తోనే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. పరశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా జులై 31వ తేదీన ఈ సినిమా నుంచి ఫస్ట్ నోటీస్ విడుదలైంది. మహేష్ కారులో నుంచి కాలు బయటపెడుతున్నట్టు రిలీజైన పోస్టర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడం గమనార్హం. టాలీవుడ్ సినీ పరిశ్రమలో వేగంగా లక్ష లైక్స్ ను సొంతం చేసుకున్న పోస్టర్ గా ఈ పోస్టర్ రికార్డులు సొంతం చేసుకుంది.

ఈ పోస్టర్ కు రికార్డు స్థాయిలో కామెంట్స్ వచ్చాయని కామెంట్స్ పరంగా కూడా ఈ సినిమా కొత్త రికార్డులు క్రియేట్ చేసిందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండటం గమనార్హం. 2022 సంవత్సరం సంక్రాంతి పండుగ కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది ఎఎస్ ప్రకాష్ ఈ సినిమాకు ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తుండగా హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.

ఈ సినిమా శాటిలైట్ హక్కులను స్టార్ మా ఛానెల్ కొనుగోలు చేసినట్లు సమాచారం. మహేష్ కు జోడీగా ఈ సినిమాలో కీర్తి సురేష్ నటిస్తున్నారు. గోపీచంద్ ఆచంట, రామ్ ఆచంట ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సర్కారు వారి పాట సినిమాకు పోటీగా రాధేశ్యామ్, పవన్ హీరోగా తెరకెక్కుతున్న అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ సినిమాలు రిలీజ్ కానున్నాయి.

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus