Sarkaru Vaari Paata: మహేష్ పాట పాడేది ఆరోజేనా?

  • July 31, 2021 / 07:45 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోలు, దర్శకులు ఈ మధ్య కాలంలో రిలీజ్ డేట్ విషయంలో రూటు మార్చారు. ఇతర స్టార్ హీరోల సినిమాల రిలీజ్ డేట్లను బట్టి తమ సినిమాల రిలీజ్ డేట్లను ప్రకటించాలని హీరోలు, దర్శకులు భావిస్తున్నారు. నిన్న రాధేశ్యామ్ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటన వెలువడగా మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట జనవరి 13వ తేదీన రిలీజయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.

గతేడాది కూడా ఒక్కరోజు గ్యాప్ తో మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో సినిమాలు రిలీజయ్యాయి. మొదట మహేష్ సినిమా రిలీజ్ కాగా తరువాత అల్లు అర్జున్ సినిమా రిలీజైంది. సర్కారు వారి పాట విషయంలో కూడా మహేష్ బాబు ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతుండటం గమనార్హం. ప్రభాస్ తో పాటు మహేష్ కూడా సంక్రాంతికే తన సినిమాను రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు.

పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ మహేష్ సినిమాకు వారం రోజుల ముందు లేదా వారం రోజుల తర్వాత రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఎఫ్3 కూడా సంక్రాంతి రేసులో నిలవడం గ్యారంటీ అని చెప్పవచ్చు. బన్నీ పుష్ప సినిమాను కూడా సంక్రాంతి రేసులో నిలపాలని మేకర్స్ గతంలో భావించినా ప్రస్తుత పరిస్థితుల్లో ఆ సినిమాను రేసులో నిలపకపోవచ్చని తెలుస్తోంది. పుష్ప మూవీ ఎప్పుడు రిలీజవుతుందో చూడాల్సి ఉంది.

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus