The Fantastic Four: First Steps Review In Telugu: ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • పెడ్రో పాస్కల్ (Hero)
  • వెనిస్సా కిర్బీ (Heroine)
  • ఎబోన్ మోస్, జోసెఫ్ క్విన్, జూలియా గార్నర్ తదితరులు.. (Cast)
  • మ్యాట్ షాక్ మ్యాన్ (Director)
  • కెవిన్ ఫీజ్ (Producer)
  • మైఖేల్ గియచ్చినో (Music)
  • జెస్ హాల్ (Cinematography)
  • నోనా ఖోడల్ - టిమ్ రోచే (Editor)
  • Release Date : జూలై 25, 2025
  • మార్వెల్ స్టూడియోస్ (Banner)

మార్వెల్ సంస్థ కి “అవెంజర్స్ ఎండ్ గేమ్” తర్వాత ఆశించిన స్థాయి విజయం దక్కలేదు. ఆమధ్య వచ్చిన “డెడ్ పూల్ 2” ఒక్కటే హిట్టయ్యింది కానీ.. ఆ క్రెడిట్ మొత్తం ర్యాన్ రొనాల్డ్స్ ఖాతాలోకి వెళ్లిపోయింది. దాంతో “ఫెంటాస్టిక్ ఫోర్” మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. టీజర్ & ట్రైలర్ వరకు మంచి అంచనాలను నమోదు చేసిన ఈ చిత్రం సినిమాగా ఏమేరకు ఆకట్టుకుంది అనేది చూద్దాం..!!

The Fantastic Four First Steps Review

కథ:

 

విశ్వంలో రకరకాల నక్షత్రాలను, గ్రహాలను నాశనం చేస్తూ వస్తున్న గెలాక్టస్.. తన చివరి ప్రయాణంగా భూమిని ఎంచుకుంటుంది. గెలాక్టస్ భూమికి రాకుండా చేయడమో లేక గెలాక్టస్ నుండి భూమిని కాపాడడం అనేది ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ బాధ్యతగా మారుతుంది. ఆ బాధ్యతను ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ ఎలా నిర్వర్తించారు? అందుకుకోసం వాళ్లు ఎదుర్కొన్న ఇబ్బందులేమిటి? అనేది సినిమా కథాంశం.

నటీనటుల పనితీరు:

 

వెనిస్సా కిర్బీ అందరికంటే ఎక్కువ మార్కులు సంపాదించుకుంది. గ్రహాన్ని కాపాడడం కోసం పాటుపడే బాధ్యతగల శక్తిగా, కన్న కొడుకును రక్షించుకోవడం కోసం ఆరాటపడే తల్లిగా ఆమె నటన అటు ఎమోషనల్ గా, ఇటు సినిమాటిక్ ఆగ ఆకట్టుకుంటుంది.

పెడ్రో పాస్కల్ ఎబోన్ మోస్, జోసెఫ్ క్విన్ లు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. జూలియా గార్నర్ ఒక డిఫరెంట్ రోల్లో అలరించింది.

సాంకేతికవర్గం పనితీరు:

మార్వెల్ సినిమాలు ఎప్పుడూ టెక్నికల్ గా హై స్టాండర్డ్ గానే ఉంటాయి. అయితే “ది న్యూ అవెంజర్స్” విషయంలోనే అది కాస్త తేడా కొట్టింది. “ఫెంటాస్టిక్ ఫోర్” విషయంలో మాత్రం ఆ తప్పులు దొరక్కుండా జాగ్రత్తపడ్డారు మేకర్స్. అందుకే గ్రాఫిక్స్ క్వాలిటీ కానీ, 3D క్వాలిటీ కానీ చాలా డీసెంట్ గా ఉన్నాయి. ముఖ్యంగా బ్లాక్ హోల్ & స్పేస్ షిప్ సీన్స్ చాలా బాగున్నాయి. అలాగే.. ఆర్ట్ & ప్రొడక్షన్ డిజైన్ కూడా బాగున్నాయి.

దర్శకుడు మ్యాట్, ఇప్పటివరకు వచ్చిన ఫెంటాస్టిక్ ఫోర్ సినిమాలతో సంబంధం లేకుండా ఒరిజినల్ కామిక్స్ బేస్ చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విధానం మంచి ప్లస్ పాయింట్ గా నిలిచింది. అందువల్ల చిన్నప్పుడు చదివిన కామిక్స్ మరోసారి దృశ్యరూపంగా చదివినట్లుగా అనిపిస్తుంది. ఇక సినిమాటిక్ హై ఇచ్చే అంశాలు, సన్నివేశాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ మంచి సంతృప్తినిస్తుంది. ఎడిటింగ్, నేపథ్య సంగీతం వంటివన్నీ సినిమాకి మంచి ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి.

విశ్లేషణ:

సాధారణంగా ఈ తరహా సినిమాలు చూస్తున్నప్పుడు మంచి సినిమాటిక్ ఎలిమెంట్స్ తోపాటు కాస్త యాంటిసిపేషన్ కూడా ఉంటుంది. “ఫెంటాస్టిక్ ఫోర్” ఆ యాంటిసిపేషన్ ఇవ్వడంలో మాత్రం తడబడింది. చాలా సాదాసీదాగా వెళ్లిపోతుంది కథనం. ఆ ఒక్క మైనస్ తప్పితే ఈ చిత్రంలో పెద్దగా వేలెత్తి చూపే నెగిటివ్ పాయింట్స్ ఏమీ కనిపించలేదు. సో, మార్వెల్ ఫ్యాన్స్ అందరూ మరీ కాలరెత్తుకుని కాకపోయినా.. హ్యాపీగా ఫీలయ్యే చిత్రమిది. మంచి స్క్రీన్ లో చూస్తే, అందులోనూ 3Dలో చూడగలిగితే మంచి ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది.

ఫోకస్ పాయింట్: మార్వెల్ కి మళ్లీ మంచి రోజులొచ్చాయి!

 

రేటింగ్: 3/5

తలైవన్ తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Rating

3
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus