ప్రభాస్ సినిమాలో పాత్ర దక్కించుకున్న ఎయిర్ టెల్ సుందరి

యువ డైరక్టర్ సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న సాహో సినిమాలో ఇప్పటికే అనేకమంది బాలీవుడ్ తారలు నటిస్తున్నారు. హీరోయిన్ గా శ్రద్ధ కపూర్, విలన్ గా నీల్ నితిన్ ముకేష్ కనిపించనుండగా.. కీలకమైన పాత్రల్లో చుంకే పాండే, జాకీష్రాఫ్, మహేష్ మంజ్రేకర్, మందిర బేడీ, ఎవ్లిన్‌ శర్మ తదితరులు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఈ బృందంలోకి తాజాగా మరో బ్యూటీ చేరింది. ఎయిర్ టెల్ ఫోర్ జీ అమ్మాయిగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సాషా ఛెత్రీ… ఆపరేషన్ గోల్డ్ ఫిష్ సినిమా తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. అడవి సాయికిరణ్ రూపొందిస్తున్న ఈ మూవీ రిలీజ్ కాకముందే ప్రభాస్ మూవీలో ఛాన్స్ అందుకుంది.

సాహోలో కాసేపే కనిపించే పాత్ర అయినప్పటికీ మంచి రోల్ అని ఫిలింనగర్ వాసులు చెప్పుకుంటున్నారు. యువీ క్రియేషన్స్ బ్యానర్లో మూడువందల కోట్ల బడ్జెట్ తో వంశీ, ప్రమోద్ లు నిర్మిస్తున్న ఈ సినిమా రెండు నెలల క్రితం అబుదాబిలో భారీ యాక్షన్ సీన్ కంప్లీట్ చేసుకుంది. హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న ఈ సీన్ సినిమాలో హైలెట్ గా నిలవనుంది. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన మార్కెట్‌ సెట్‌ లో మరో షెడ్యూల్ పూర్తి చేశారు. త్వరలోనే మరో షెడ్యూల్ కి సిద్ధమవుతున్నారు. ఈ షెడ్యూల్లో సాషా జాయిన్ కానుంది. బాలీవుడ్ సంగీత త్రయం శంకర్ – ఇషాన్ – లాయ్ లు సంగీతాన్ని అందిస్తున్న సాహో వేసవికి థియేటర్లోకి రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus