Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Reviews » Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

  • May 8, 2026 / 01:45 PM ISTByFilmy Focus Desk
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • దేవ్ మోహ‌న్‌ (Hero)
  • లావ‌ణ్య త్రిపాఠి (Heroine)
  • న‌రేశ్ వి.కె, స‌ప్త‌గిరి, వీటీవీ గ‌ణేశ్‌, మొట్ట రాజేంద్ర‌న్‌, జాఫ‌ర్‌, జోషి త‌దిత‌రులు (Cast)
  • తాతినేని స‌త్య‌ (Director)
  • నాగమోహ‌న్ (Producer)
  • మిక్కీ జె.మేయ‌ర్‌ (Music)
  • బినేంద్ర మీన‌న్‌ (Cinematography)
  • స‌తీష్ సూర్య‌ (Editor)
  • Release Date : 7th మే 2026
  • దుర్గాదేవి పిక్చ‌ర్స్ (Banner)

వ‌రుణ్‌తేజ్‌తో పెళ్లి త‌ర్వాత మెగా కోడ‌లు లావ‌ణ్య త్రిపాఠి న‌టించిన తొలి మూవీ స‌తీ లీలావ‌తి. భీమిలి క‌బ‌డ్డి జ‌ట్టు ఫేమ్ తాతినేని స‌త్య ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీలో మ‌ల‌యాళ న‌టుడు దేవ్ మోహ‌న్ హీరోగా క‌నిపించాడు. ప‌లుమార్లు రిలీజ్ పోస్ట్‌పోన్ అవుతూ వ‌చ్చిన‌ ఈ సినిమా ఎట్ట‌కేల‌కు ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. స‌తీ లీలావ‌తి ఎలా ఉంది? పెళ్లి త‌ర్వాత మెగా కోడ‌లికి హిట్టు ద‌క్కిందా? లేదా? అంటే?

Sathi Leelavathi Movie Review

Sathi Leelavathi Movie Review and Rating

క‌థ‌: లీలావతి (లావ‌ణ్య త్రిపాఠి) సినిమా డైరెక్టర్.అనాథ అయిన‌ సైకాలజిస్ట్ రామ్ సేతు (దేవ్ మోహ‌న్‌)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది.సినిమా షూటింగ్ లతో ఎప్పుడూ బిజీగా ఉంటూ భర్తను పట్టించుకోదు లీలా. మూడేళ్ల కాపురం తర్వాత లీలాకు విడాకులు ఇచ్చి నికోల సెబాస్టియన్ (మ‌డోన్నా సెబాస్టియ‌న్‌) అనే మ‌రో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు సేతు. కానీ విడాకులు ఇవ్వ‌డానికి లీలా ఒప్పుకోదు. సేతు ను కొట్టి ఇంట్లోనే కట్టి పడేస్తుంది. ఆ త‌ర్వాత ఏమైంది. సేతు కోసం వ‌చ్చిన లాయ‌ర్ త‌మ‌ల‌పాకుల సుంద‌ర‌పాండియ‌న్‌తో (వీటీవీ గ‌ణేష్‌) పాలు నికోలాకు లీలా ఎలాంటి అబ‌ద్దాలు చెప్పింది? లీలా ప్రేమ‌ను సేతు అర్థం చేసుకున్నాడా? లీలా లైఫ్‌లో నికోలా కాకుండా ప్రియా పేరుతో ఉన్న మ‌రో అమ్మాయి ఎవ‌రు? సేతులో మార్పు కోసం లీలా ఎలాంటి నాట‌కాలు ఆడింది? ఆమెకు ఓ దొంగ (స‌ప్త‌గిరి)తో పాటు బ్లూ ఫిల్మ్స్ తీసే మొట్ట రాజ‌ర్ (మొట్ట రాజేంద్ర‌న్‌) ఎలాంటి సాయం చేశారు ? అన్న‌దే స‌తీలీలావ‌తి మిగిలిన క‌థ‌.

Sathi Leelavathi Movie Review and Rating

న‌టీన‌టుల ప‌నితీరు: మెగా కోడ‌లు లావ‌ణ్య త్రిపాఠి ఈ సినిమా కోసం చాలానే క‌ష్ట‌ప‌డింది. ఫైట్స్‌, కామెడీ, సెంటిమెంట్‌…ఇలా అన్ని ఎమోష‌న్స్ ప‌డింది. కానీ ద‌ర్శ‌కుడు రాసుకున్న ఔట్‌డేటెడ్ కాన్సెప్ట్ కార‌ణంగా ఆమె క‌ష్టం వృథాగా మారింది. దేవ్ మోహ‌న్ స్టైలిష్‌గా క‌నిపించాడు. కానీ అత‌డి ఓన్ డ‌బ్బింగ్ సినిమాకు సెట్ట‌వ్వ‌లేదు. ప్రేమ‌మ్ ఫేమ్ మ‌డోన్నా సెబాస్టియ‌న్ క్యారెక్ట‌ర్ హీరోయిన్‌కు త‌క్కువ‌…గెస్ట్ రోల్‌కు ఎక్కువ అన్న‌ట్లుగా సాగుతుంది.

మోట్ట రాజేంద్ర‌న్‌, స‌ప్త‌గిరి, వీటీవీ గ‌ణేష్‌, తాగుబోతు ర‌మేష్‌తో పాటు సినిమాలు చాలా మందే క‌మెడియ‌న్లు ఉన్నా ఒక్క‌రూ కూడా న‌వ్వించ‌లేక‌పోయారు. సీనియ‌ర్ న‌రేష్‌ను ద‌ర్శ‌కుడు స‌రిగ్గా వాడుకోలేదు.

Sathi Leelavathi Movie Review and Rating

సాంకేతిక వ‌ర్గం ప‌నితీరు: డైరెక్ట‌ర్‌గానే కాకుండా రైట‌ర్‌గా కూడా తాతినేని స‌త్య ఆడియెన్స్‌ను ఇంప్రెస్ చేయ‌డంలో ఫెయిల‌య్యాడు. క‌థ‌, కామెడీ విష‌యంలో అత‌డి ఆలోచ‌న‌లు 1990 ద‌గ్గ‌రే ఆగిపోయిన ఫీలింగ్ క‌లుగుతుంది. మిక్కీ జే మేయ‌ర్ పాట‌లు బాగున్నా సీన్‌కు, సిట్యూవేష‌న్‌కు సంబంధం లేకుండా రావ‌డం మైన‌స్‌గా మారింది. సినిమా షూటింగ్ దాదాపు ఒకే బిల్డింగ్‌లో సాగుతుంది. హిల్ స్టేష‌న్ బ్యాక్‌డ్రాప్ ఒక్క‌టి బాగుంది. కెమెరామెన్ బినేంద్ర మీన‌న్ టెక్నీషియ‌న్ల‌లో త‌న ప‌నికి న్యాయం చేశాడు. ప్రొడ్య‌క్ష‌న్ వాల్యూస్ అంతంత మాత్రంగానే ఉన్నాయి. మిగిలిన విభాగాల గురించి చెప్పుకోవ‌డానికి ఏం లేదు.

Sathi Leelavathi Movie Review and Rating

విశ్లేష‌ణ‌: స‌తీ లీలావ‌తి క‌మ‌ల్ హాస‌న్ కెరీర్‌లో ఎవ‌ర్ గ్రీన్ మూవీస్‌లో ఒక‌టిగా నిలిచింది. కేవ‌లం టైటిల్ విష‌యంలోనే కాదు క‌థ ప‌రంగా మేక‌ర్స్ క‌మ‌ల్ హాస‌న్ సినిమా నుంచి ఇన్‌స్పైర్ అయ్యి నేటి స‌తీ లీలావ‌తిని తెర‌కెక్కించారు. ముక్క‌లైపోతున్న స్నేహితుడి కాపురాన్ని ఓ వ్య‌క్తి ఎలా నిల‌బెట్టాడు అనే కాన్సెప్ట్‌తో క‌మ‌ల్ హాస‌న్ స‌తీ లీలావ‌తి రూపొందింది. లావ‌ణ్య త్రిపాఠి మూవీ క‌థ కూడా ఇంచుమించు ఇదే. కానీ రిజ‌ల్ట్ విష‌యంలో మాత్రం సేమ్ మ్యాజిక్ రిపీట్ కాలేదు.

భార్యాభ‌ర్త‌ల‌ బంధానికి మ‌ర‌ణంతోనే ముగింపు ప‌డాలి కానీ మ‌న‌స్ప‌ర్థ‌ల‌తో కాద‌నే చిన్న పాయింట్‌ను తీసుకొని ద‌ర్శ‌కుడు తాతినేని స‌త్య ఈ సినిమాను తెర‌కెక్కించారు. నేటి బిజీ లైఫ్ కార‌ణంగా భార్య‌భ‌ర్త‌లు ఒక‌రికొరు టైమ్ కేటాయించుకోవ‌డం త‌గ్గిపోయింది. ఆ దూరం కొన్ని సార్లు విడిపోయే వ‌ర‌కు వెళుతుంద‌నే మెసేజ్‌ను అందించారు. గొడ‌వ‌లు, అభిప్రాయ‌భేదాలు స‌హ‌జం. అంత మాత్రానికే విడాకులు తీసుకోవ‌డం క‌రెక్ట్ కాద‌ని ఈ సినిమాతోచెప్పాల‌ని అనుకున్నారు.

ద‌ర్శ‌కుడి ఆలోచ‌న బాగానే ఉంది. కానీ రాత‌లో ఉన్న క్రియేటివిటీ తీత‌లో మాత్రం క‌నిపించ‌లేదు. అస‌లు స్క్రీన్‌పై ఏం జ‌రుగుతుందో…ఏ పాత్ర ఎందుకు వ‌స్తుందో అర్థం కాదు. కామెడీ పేరుతో ర‌క‌ర‌కాల క్యారెక్ట‌ర్ల‌ను ప్ర‌వేశ‌పెట్టి క‌థ‌ను మొత్తం కిచిడి చేశాడు. సినిమాలో ఒక్క‌టంటే ఒక్క సీన్ కూడా న‌వ్వించ‌క‌పోగా చిరాకును తెప్పిస్తాయి. జెన్‌జీ ఆడియెన్స్‌కు అర్థ‌మ‌య్యేలా చెప్పాల‌నే లీలా, సేతు గొడ‌వ‌ల‌ను కాస్తంత వ‌య‌లెంట్‌గానే చూపించారు డైరెక్ట‌ర్‌. వారి త‌గ‌వుల‌తోనేఈ సినిమా మొద‌ల‌వుతుంది. ఆ త‌ర్వాత ఫ్లాష్‌బ్యాక్ రూపంలో లీలా, సేతు ప్రేమ క‌థ‌ను చూపించారు. త‌న డైరెక్ట‌ర్ టాలెంట్‌ను ఉప‌యోగించి త‌న కాపురాన్ని లీలా ఎలా చ‌క్క‌దిద్దుకుంద‌నే అంశాల చుట్టూ సెకండాఫ్ సాగుతుంది. ఆ ప్లాన్స్ మొత్తం క‌థ‌కు సంబంధం లేకుండా సిల్లీగా సాగుతాయి. హ‌డావిడి త‌ప్పితే ఏ ఒక్క పాత్ర‌కు స‌రైన జ‌స్టిఫికేష‌న్ ఉండ‌దు. క్లైమాక్స్ ఎప్ప‌డొస్తుందా అని నీర‌సంగా ఎదురుచూడ‌టం త‌ప్పితే చేసిది ఏం ఉండ‌దు.

Sathi Leelavathi Movie Review and Rating

ఫోక‌స్ పాయింట్‌: లీలావ‌తిని చివ‌రివ‌ర‌కు భ‌రించ‌డం క‌ష్ట‌మే. న‌స‌ ఎక్కువ‌… విష‌యం త‌క్కువ‌…

రేటింగ్: 1.5/5

Rating

1.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dev Mohan
  • #Lavanya Tripathi
  • #Madonna Sebastian
  • #Sathi Leelavathi Movie

Reviews

Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

trending news

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

19 mins ago
Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

20 hours ago
JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

22 hours ago
Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

24 hours ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

1 day ago

latest news

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

1 day ago
Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

1 day ago
Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

1 day ago
Varanasi: ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి అప్‌డేట్‌.. త్వరలోనే..

Varanasi: ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి అప్‌డేట్‌.. త్వరలోనే..

1 day ago
Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version