Sathyam Sundaram Collections: ‘సత్యం సుందరం’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే?

కార్తీ (Karthi) , అరవింద్ స్వామి (Arvind Swamy)  కాంబినేషన్లో ‘సత్యం సుందరం’ (Sathyam Sundaram) (తమిళంలో మెయాజ్‌హ‌గ‌న్‌) అనే సినిమా రూపొందింది. ఈ సినిమా టీజర్, ట్రైలర్స్ ఇంప్రెస్ చేశాయి. తమిళంలో ’96’, తెలుగులో ‘జాను'(96 రీమేక్) వంటి సినిమాలు చేసిన సి ప్రేమ్ కుమార్  (C. Prem Kumar) ..దీనికి దర్శకుడు. సెప్టెంబర్ 27న తమిళంలో ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. తెలుగులో ‘దేవర’ (Devara) వంటి పెద్ద సినిమా ఉండటంతో ఒకరోజు ఆలస్యంగా అంటే సెప్టెంబర్ 28న విడుదల చేశారు.

Sathyam Sundaram Collections

మొదటి రోజు ఈ సినిమాకి తెలుగులో కూడా మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే ‘దేవర’ పోటీగా ఉండటంతో.. పర్వాలేదు అనిపించే ఓపెనింగ్స్ ను రాబట్టుకుంది. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 0.38 cr
సీడెడ్ 0.16 cr
ఉత్తరాంధ్ర 0.19 cr
ఈస్ట్+వెస్ట్ 0.11 cr
కృష్ణా + గుంటూరు 0.13 cr
నెల్లూరు 0.09 cr
ఏపి+ తెలంగాణ 1.06 cr

‘సత్యం సుందరం’ చిత్రానికి రూ.6.27 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.7 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ చిత్రం రూ.1.06 కోట్ల షేర్ ను రాబట్టింది. కార్తీ గత చిత్రం ‘జపాన్’ కంటే పర్వాలేదు అనిపించే విధంగా ఈ సినిమా కలెక్ట్ చేసింది. కానీ ‘దేవర’ పోటీగా ఉండటం వల్ల అనుకున్న రేంజ్లో కాదు. బ్రేక్ ఈవెన్ కోసం ఈ సినిమా ఇంకా రూ.5.94 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

2వ రోజు కూడా కుమ్మేసిన ‘దేవర’.!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus