మాజీ ‘మిస్ ఇండియా ఎర్త్’ అదృశ్యం… ఏమైందంటే?
- April 7, 2026 / 01:05 PM ISTByFilmy Focus Desk
మాజీ మిస్ ఇండియా అదృశ్యమైన ఘటన సంచలనంగా మారింది. పుణెలోని పింప్రి – చించ్వాడ్‌లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు టాక్ ఆఫ్ ది పుణెగా మారింది. మిస్ ఇండియా ఎర్త్ 2019 విజేత సయాలీ సర్వే, ఆమె నలుగురు పిల్లలే ఈ ఘటనలో అదృశ్యమయ్యారు. పింప్రి- చించ్వాడ్‌లో ఉండే సయాలీ కొన్నేళ్ల క్రితం అతీఫ్ తాసే అనే ఓ ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకున్నారు. అప్పుడు మతం మార్చుకున్న ఆమె ఇటీవల తిరిగి హిందూ మతంలోకి మారారు. ఈ మార్పు జరిగిన కొన్ని రోజులకే ఈ అదృశ్యం ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.
Sayali Surve
అయితే, సయాలీ భర్త, అత్తింటివారే కిడ్నాప్ చేశారంటూ ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇక పెళ్లి సమయంలో సయాలీ తన పేరును అతీజాగా మార్చుకొన్నారు. ఆ తర్వాత భర్త వేధింపులకు పాల్పడుతున్నాడు అంటూ ఆమె ఆరోపించారు. ఈ క్రమంలోనే తన నలుగురు పిల్లలతో కలసి ఆమె హిందూ మతంలోకి మారారు. తన పేరును ఆద్య సుర్వేగా మార్చుకున్నారు. ఇది జరిగిన కొన్ని రోజులకే కిడ్నాప్ అయ్యారు.

అతీఫ్ విడిచిన సమయంలో సయాలీ మీడియాతో మాట్లాడుతూ తాను ఇన్నేళ్లుగా ఎదుర్కొన్న ఇబ్బందికర పరిస్థితుల గురించి వివరించింది. ‘‘రోజులో 24 గంటలూ తిట్లు తినేదాన్ని. తప్పు చేయకుండా దెబ్బలు కూడా కాశాను. తొలుత ఇదేంటి ఇలా చేస్తున్నారు అనిపించేది. ఆ తర్వాత అవి సాధారణమైపోయాయి’’ అంటూ ఆమె పడ్డ ఇబ్బందుల్ని వివరించడం గమనార్హం.
సయాలీ తన మతాన్ని హిందూత్వంలోకి మార్చుకునే కార్యక్రమాన్ని పింప్రి – చించ్వాడ్‌లో పెద్ద కార్యక్రమం పెట్టారు. దీనికి స్థానిక నాయకులు, భజరంగ్ దళ్ సభ్యులు పెద్ద ఎత్తున వచ్చారు. ఇప్పుడు ఆ నాయకులు అంటూ ఆమెకు మద్దతుగా ఆ ప్రాంతంలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. అన్నట్లు ఈ కిడ్నాప్ ఆరోపణలను అతీఫ్ తల్లిదండ్రులు ఖండించారు.












