అఖిల్ హీరోయిన్ కి మరో ఆఫర్!
- June 27, 2016 / 05:56 AM ISTByFilmy Focus
“అఖిల్” అనే డిజాస్టర్ సినిమా ద్వారా తెలుగు చిత్రసీమకు హీరోయిన్ గా పరిచయమైన బాలీవుడ్ సుందరి సాయేషా.. ఆ సినిమా రిజల్ట్ కారణంగా టాలీవుడ్ నుంచి దాదాపుగా పారిపోయినంత పనిచేసింది. ఆ తర్వాత టాలీవుడ్ లో అమ్మడిని పట్టించుకొనేవారు కరువయ్యారు. ఇక ఈ అమ్మాయిని తెలుగులో మళ్ళీ చూడలేమని ఫిక్స్ అయిపోయారు మన టాలీవుడ్ ప్రేక్షకులు. కానీ విచిత్రంగా సాయేషా మళ్ళీ వెలుగులోకి వచ్చింది.
రాజ్ తరుణ్ కథానాయకుడుగా “దొంగాట” ఫేమ్ వంశీకృష్ణ తెరకెక్కిస్తున్న చిత్రంలో సాయేషాను హీరోయిన్ గా సెలక్ట్ చేసుకొన్నారని తెలుస్తోంది. నెక్స్ట్ షెడ్యూల్ నుంచి సాయేషా షూటింగ్ లో పాల్గొంటుందని తెలుస్తోంది!
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus















