స్క్రీన్ ప్లే రాయడంలో దేవుడికి మించిన వాడు లేడు. ప్రతి సంఘటనకు ఎక్కడో లింక్ పెడతాడు. అటువంటి స్క్రీన్ ప్లే లో ఒక దాన్ని ” స్క్రీన్ ప్లే ఆఫ్ గాడ్” షార్ట్ ఫిలిం లో చక్కగా చూపించారు. ఈ సినిమా టైటిల్స్ పడేటప్పుటే క్యూరియాసిటీ కలిగించారు. దీంతో సినిమా మొదలు కాక ముందే ఆడియన్స్ ని కూర్చోపెట్టింది.
నాస్తికుడు ఆస్తికుడిగా ఎలా మారాడు? అనే ఒక డ్రీం కథను ప్లే చేస్తూనే, దానిని నిజ జీవీతానికి మిక్స్ చేయడం చాలా బాగుంది. ఆర్టిస్టులు కొత్త వారైనా తమ పాత్రలకు తగిన విధంగా నటించారు. అమ్మాయిలు ఉంటేనే షార్ట్ ఫిలిం హిట్ అవుతుందనే అపోహను ఈ చిత్రం బీట్ చేసింది. ఈ సినిమాలోని ప్రధాన పాత్రల్లో నటించిన వారు నలుగురూ అబ్బాయిలే. అయినా ఎక్కడా బోర్ కొట్టదు. కథే ఎప్పటికి హీరో అని స్క్రీన్ ప్లే ఆఫ్ గాడ్ నిరూపించింది.
“దేవుడు కష్టాల్లో ఉన్నప్పుడు కాదు.. అవసరమైనప్పుడు సహాయం చేస్తాడు” అనే లైన్ తో కథ రాసుకుని.. దానిని 24 నిముషాల్లో అర్ధవంతంగా చెప్పడంలో దర్శకుడు ఇందు చందు సక్సస్ అయ్యాడు. టైటిల్ కూడా జస్టిపై అయ్యింది. దేవేంద్ర నాథ్ కెమెరా పనితనం ప్రొఫిషనల్ గా ఉంది. ఎడిటింగ్ కూడా జర్క్ లు లేకుండా చేశాడు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పైన కాస్త శ్రద్ధ పెట్టి ఉంటే ఇంకా బాగుండేది.
రన్ వే రీల్ ఇలాంటి సినిమాలను నెటిజనులకు అందిచడంలో ఎప్పుడూ ముందు ఉంటుంది. వీరు ప్రెజెంట్ చేసే మూవీ లో ఏదో స్పెషల్ ఉంటుందని “స్క్రీన్ ప్లే ఆఫ్ గాడ్” షార్ట్ ఫిలిం మరో సారి చాటింది.