బంపర్ ఆఫర్ కొట్టేసిన తమిళ బ్యూటీ!

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పునః ప్రారంభించారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ పాత్రకు జోడీగా బ్రిటీష్ భామ ఒలీవియా కనిపించనుంది. అలానే ఇందులో మరో ప్రధాన పాత్ర పోషిస్తోన్న అజయ్ దేవగన్ పాత్రకు జోడీగా శ్రియ నటించనుంది.

ఇదిలా ఉండగా.. ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’లో మరో హీరోయిన్ కూడా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడీగా మరో అమ్మాయి కూడా కనిపిస్తుందట. ఈ పాత్ర కోసం తమిళంలో గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్యా రాజేష్ ను ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ పోషించేది గిరిజన వీరుడు కొమరం భీమ్ పాత్ర. కథ ప్రకారం ఈ పాత్రకి మరదలి పాత్రలో ఓ గిరిజన యువతి కనిపించాల్సి ఉంటుందట. ఆ పాత్ర కోసమే ఐశ్వర్యని ఓకే చేసినట్లు చెబుతున్నారు.

గిరిజన యువతి పాత్రకు ఐశ్వర్యా రాజేష్ బాగా సూట్ అవుతుందని.. అలానే దక్షిణాది భాషల్లో ఆమెకి మంచి గుర్తింపు ఉండడంతో.. సినిమాకి కలిసొస్తుందని భావిస్తున్నాడట దర్శకుడు రాజమౌళి. త్వరలోనే ఐశ్వర్య ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతుందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో కొన్ని కీలక యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అలియాభట్ కూడా ఈ వారంలో సినిమా షూటింగ్ లో పాల్గొనుంది.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus