Mahesh Babu, Trivikram: మహేష్-త్రివిక్రమ్ మూవీలో సెకండ్ హీరోయిన్ ఫిక్స్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ షూటింగ్ ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. అటు తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నాడు. టైటిల్ ఇంకా ఫిక్స్ కాని ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా ఎంపికైంది. అయితే త్రివిక్రమ్ సినిమాల్లో సెకండ్ హీరోయిన్ కు కూడా చోటు ఉంటుంది. ‘జల్సా’ లో పార్వతి మిల్టన్, ‘అత్తారింటికి దారేది’ లో ప్రణీత, ‘అరవింద సమేత’ లో ఈశారెబ్బా, ‘అల వైకుంఠపురములో’ లో నివేదా పేతురేజ్.

వాళ్ళ పాత్రలకి ప్రాముఖ్యత ఉన్నా లేకపోయినా ఫ్రేమ్ కళకళలాడటానికి అతికిస్తూ ఉంటాడు. ఏదో ఒక పాటలో కూడా ఆ సెకండ్ హీరోయిన్ కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మహేష్ సినిమా కోసం కూడా అదే సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నాడు. మహేష్ బాబుతో చేసే మూవీ పక్కా ఫ్యామిలీ డ్రామా. అతను స్టైల్లో కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. ఈ క్రమంలో హీరోయిన్ కు సోదరి పాత్ర కూడా ఒకటి ఉంటుందట.

అందుకోసం చాలా మంది భామల్ని అనుకున్నారు. అనన్య నాగళ్ళ, నిధి అగర్వాల్ వంటి వాళ్ళు ఈ పాత్రకి ఎంపికైనట్టు గతంలో ప్రచారం జరిగింది. ఈ మధ్యనే సంయుక్త మీనన్ పేరు కూడా వినిపించింది. ‘భీమ్లా నాయక్’ లో నటిస్తుంది కాబట్టి.. దాదాపు ఆమె ఫైనల్ అయినట్టే అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు అను ఇమ్మాన్యుయేల్ పేరు కూడా వినిపిస్తుంది. దాదాపు ఈమె ఫైనల్ అయినట్టే అని వినికిడి. అను ఇమ్మాన్యుయేల్ ఈ మధ్య కాలంలో ఎక్కువ ఇలాంటి పాత్రలే చేస్తుంది.

‘అల్లుడు అదుర్స్’ ‘మహాసముద్రం’ సినిమాల్లో చేసింది. త్రివిక్రమ్ ‘అజ్ఞాతవాసి’ లో కూడా ఈమె నటించింది. అధికారిక ప్రకటన వస్తే కాని ఈమె కూడా ఫిక్స్ అయినట్టు చెప్పలేము.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus