Nazriya: కావాలనే గ్యాప్స్ ఇస్తుంటా.. హీరోయిన్ క్లారిటీ!

2014లో హీరోయిన్ గా సినిమాలు చేసింది. మళ్లీ 2018 వరకు కనిపించలేదు. అప్పుడొక సినిమా చేసింది. మళ్లీ రెండేళ్లు గ్యాప్ తీసుకుంది. ఆ తరువాత మళ్లీ రెండేళ్లు గ్యాప్ తీసుకొని ఇప్పుడు 2022లో ఓ సినిమా చేస్తోంది. నజ్రియా ఎందుకిలా గ్యాప్ తీసుకుంటుంది..? ఆ గ్యాప్ లో ఆమె చేస్తుంటుంది..? కావాలనే సినిమాలను పక్కన పెడుతుందా..? ఇలా చాలా సందేహాలు ఉన్నాయి. తాజాగా వీటిపై నజ్రియా రియాక్ట్ అయింది. ఆమె మాట్లాడుతూ.. ‘ఓ సినిమా పూర్తయిన తరువాత బ్రేక్ తీసుకోవాలనుకుంటాను.

అది కాస్త రెండేళ్లు అవుతుంది. నేను స్టోరీ విని రిజెక్ట్ చేస్తానని చాలా మంది అనుకుంటారు. కానీ అలాంటిదేమీ లేదు. కొంతమంది వచ్చి స్క్రిప్ట్స్ చెబుతుంటారు. ఆ సమయంలో నేను సినిమాలు చేసే మూడ్ లో ఉండను. కొన్ని సార్లు ట్రావెలింగ్ లో ఉంటాను. వ్యక్తిగత జీవితానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను. అందుకే తక్కువగా సినిమాలు చేస్తాను’ అని చెప్పుకొచ్చింది. స్క్రిప్ట్స్ విషయంలో తను సెలక్టివ్ గా ఉంటానని.. అందుకే చాలా తక్కువ మంది మాత్రమే తనకు కథలు వినిపిస్తారని నజ్రియా తెలిపింది.

అందుకే తన కెరీర్ లో గ్యాప్స్ ఎక్కువగా కనిపిస్తాయని చెబుతోంది. ఒకప్పుడు చాలా మంది ఆడియన్స్ తన కమ్ బ్యాక్ ను సెలబ్రేట్ చేసేవాళ్లను.. ఆ తరువాత వాళ్లకు కూడా అర్ధమైపోయింది చెప్పింది. తన బ్రేక్స్ ను చూసి కమ్ బ్యాక్ ను సెలబ్రేట్ చేయడం మానేశారని చెప్పింది. ఇప్పుడు అందరూ తనను లైట్ తీసుకుంటున్నారని జోక్ చేసింది.

ఎన్ని బ్రేక్స్ తీసుకున్నా, తనను ఇష్టపడే వారు ఇంకా ఉన్నారని.. అది తన అదృష్టమని చెప్పింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘అంటే సుందరానికి’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతుంది. మరో ఐదు రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో నజ్రియా ఎలాంటి హిట్ కొడుతుందో చూడాలి!

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus