టచ్ చేసి చూడు సినిమా విశేషాలు చెప్పిన సీరత్ కపూర్

‘రన్‌ రాజా రన్‌’ సినిమాతో తెలుగువారికి పరిచయమైన సీరత్‌ కపూర్‌ ‘రాజుగారి గది 2 ‘ చిత్రంతో మరింత దగ్గరైంది. తాజాగా రవితేజ ‘టచ్‌ చేసి చూడు’ సినిమాలో రాశీ ఖన్నాతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఫిబ్రవరి 2 న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన సీరత్ కపూర్ అనేక ఆసక్తికర సంగతులు చెప్పింది. “రవితేజ అంటేనే మాస్‌. అందులోనూ పోలీసు కథ అనేసరికి ఆ మాస్‌ డబుల్‌ అవుతుంది. సినిమా చూసే ప్రతిఒక్కరూ పూర్తి సంతృప్తితో థియేటర్‌ నుంచి బయటకు వస్తారు. సినిమా నేపథ్యం సీరియస్‌ స్లాట్‌ అయినా.. రవితేజ తనదైన కామెడీతో సినిమాను నడిపించారు” అని సీరత్ వెల్లడించింది. తన పాత్ర గురించి వివరిస్తూ.. “సినిమాలో రవితేజను బాగా డామినేట్‌ చేసే పాత్ర నాది.

అది చేయ్‌, ఇది చేయ్‌, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం అంటూ రవితేజను తెగ డామినేట్‌ చేస్తుంటా.” అని నవ్వేసింది. అంతేకాదు మరో రహస్యాన్ని కూడా బయటపెట్టింది. ఈ చిత్రంలో ఓ మాస్ సాంగ్ ఉందంట. అందులో రవితేజ్‌ మాస్‌ స్టెప్పులతో అదరగొట్టేశారని తెలిపింది. ఆ పాటని తాను బాగా ఎంజాయ్ చేసానని, ఆడియన్స్ కూడా బాగా విజిల్స్ వేస్తారని చెప్పింది. రాజా ది గ్రేట్ వంటి విజయం తర్వాత రవితేజ చేసిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus