Seetimaarr Collections: అద్భుతమైన ఓపెనింగ్స్ ను నమోదు చేసిన ‘సీటీమార్’..!

గోపీచంద్ హీరోగా మాస్ డైరెక్టర్ సంప‌త్ నంది దర్శకత్వంలో తెర‌కెక్కిన లేటెస్ట్ మూవీ ‘సీటీమార్‌’. పవన్‌ కుమార్ స‌మ‌ర్పణ‌లో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకం పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో దిగంగన సూర్యవంశీ సెకండ్ హీరోయిన్ గా నటించింది. భూమిక,రెహమాన్ కూడా కీలక పాత్రలు పోషించారు. సెప్టెంబర్ 10న(నిన్న) వినాయక చవితి కానుకగా రిలీజ్ అయిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు ఓపెనింగ్స్ కూడా అదిరిపోయాయనే చెప్పాలి.

మొదటి రోజు కలెక్షన్లను ఓసారి గమనిస్తే :

నైజాం 0.93 cr
సీడెడ్ 0.56 cr
ఉత్తరాంధ్ర 0.29 cr
ఈస్ట్ 0.27 cr
వెస్ట్ 0.15 cr
గుంటూరు 0.43 cr
కృష్ణా 0.21 cr
నెల్లూరు 0.19 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 3.03 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.14 Cr
  ఓవర్సీస్ 0.05 Cr
వరల్డ్ వైడ్ (టోటల్) 3.22 cr

 

‘సీటీమార్’ చిత్రానికి రూ.13.23 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఓవర్సీస్ లో ముఖ్యంగా అమెరికాలో ఈ చిత్రం రిలీజ్ కాలేదు.అది మాత్రమే ఈ మూవీకి దెబ్బ అని చెప్పాలి. మిగిలిన అన్ని ఏరియాల్లోనూ సూపర్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది ‘సీటీమార్’ మూవీ.రూ.14 కోట్ల షేర్ ను రాబడితే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించినట్టే. మొదటి రోజు ఈ చిత్రం రూ.3.22 కోట్ల షేర్ ను రాబట్టింది. మరో రూ.10.78 కోట్ల షేర్ ను రాబడితే ఈ చిత్రం క్లీన్ హిట్ గా నిలిచే అవకాశం ఉంటుంది.

Click Here For Review

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus