Seetimaarr: ‘సీటీమార్’ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

గోపీచంద్ హీరోగా మాస్ డైరెక్టర్ సంప‌త్ నంది దర్శకత్వంలో తెర‌కెక్కిన లేటెస్ట్ మూవీ ‘సీటీమార్‌’. పవన్‌ కుమార్ స‌మ‌ర్పణ‌లో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకం పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో భూమిక,దిగంగన సూర్యవంశీ కీలక పాత్రలు పోషిస్తుండగా మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇప్ప‌టికే రిలీజైన టీజర్, పాటలు, ట్రైల‌ర్‌కి మంచి స్పందన లభించింది.దాంతో సినిమా పై అంచనాలు కూడా పెరిగాయి.వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10న(రేపు) ఈ చిత్రం విడుదల కాబోతుంది.

ఈ చిత్రం థియేట్రికల్ బిజినెస్ వివరాలను ఓసారి పరిశీలిస్తే :

నైజాం 4.00 cr
సీడెడ్ 2.50 cr
ఉత్తరాంధ్ర 1.57 cr
ఈస్ట్ 1.10 cr
వెస్ట్ 0.85 cr
గుంటూరు 1.20 cr
కృష్ణా 0.96 cr
నెల్లూరు 0.60 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 12.78 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్  0.45 Cr
వరల్డ్ వైడ్ (టోటల్) 13.23 cr

 

‘సీటీమార్’ చిత్రానికి రూ.13.23 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఓవర్సీస్ లో ఈ చిత్రం రిలీజ్ కావడం లేదని సమాచారం. దాంతో ఆ లెక్కలు బయటకు రాలేదు. ఇక మిగిలిన ఏరియాల లెక్కల ప్రకారం అయితే ఈ చిత్రం రూ.14 కోట్ల షేర్ ను రాబడితే బ్రేక్ ఈవెన్ సాధించినట్టే. వినాయక చవితి సెలవురోజు ఈ చిత్రానికి కలిసొచ్చే అవకాశం ఉంది. అయితే ఓటిటిలో రిలీజ్ అవుతున్న ‘టక్ జగదీష్’ ‘నెట్’ సినిమాల ప్రభావం ‘సీటీమార్’ పై ఎంతవరకు పడుతుంది అనేది చూడాలి..!

Most Recommended Video

బిగ్‌ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus