Sekhar Kammula, Dhanush : పిక్ టాక్: మొదటిసారి కనిపించిన ధనుష్, కమ్ముల

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల మొదటిసారి బార్డర్ దాటి ధనుష్ తో వర్క్ చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రయోగం చేయబోతున్న ఈ సీనియర్ దర్శకుడు ఎలాంటి సినిమా చేస్తాడా అని సౌత్ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక మొదటిసారి హిందీని కూడా టచ్ చేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. ఈ ట్రిలాంగ్యువల్ సినిమాను ధనుష్ ఒప్పుకున్నాడు అంటే కంటెంట్ లో ఎదో బలమైన పాయింట్ ఉండే ఉంటుందని కామెంట్స్ వస్తున్నాయి.

ఇక మొత్తానికి మొదటిసారి ధనుష్, శేఖర్ కమ్ముల స్టిల్ ఇచ్చిన ఫొటో బయటకు వచ్చింది. ఏషియన్ సినిమాస్ అధినేతలతో కలిసి ప్రాజెక్ట్ పై కొన్ని గంటల పాటు చర్చలు జరిపారు. కథ గురించి ముందే వినిపించిన శేఖర్ కమ్ముల ఈసారి స్క్రిప్ట్ ప్లానింగ్ గురించి మొత్తం వివరించాడట. వచ్చే ఏడాది సినిమాను స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. క్యాస్టింగ్ విషయంలో కమ్ముల ఏ మాత్రం తగ్గేలా లేరని అనిపిస్తోంది. టాప్ స్టార్స్ నటిస్తారని సమాచారం. ధనుష్ కూడా సినిమా కాన్సెప్ట్ పై చాలా నమ్మకంతో ఉన్నాడట.

ఇక శేఖర్ కమ్ముల గతంలో టాలీవుడ్ అగ్ర హీరోలతో వర్క్ చేయాలని చాలా ప్రయత్నాలు చేశాడు గాని వర్కౌట్ కాలేదు. ఇక ధనుష్ నమ్మాడు అంటే శేఖర్ టాలెంట్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. స్టార్స్ ఒప్పుకుంటే తప్పకుండా అనుకున్నట్లు తాను సినిమా చేయగలని కమ్ముల చాలాసార్లు చెప్పారు. ఇక ధనుష్ లాంటి టాలెంటెడ్ హీరో దొరికాడు కాబట్టి ఆయన విశ్వరూపం చూపిస్తాడాని చెప్పవచ్చు.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus