Sekhar Kammula, Mahesh Babu: శేఖర్ కమ్ముల సినిమాకు మహేష్ ఓకే చెబుతారా?

మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నరనే సంగతి తెలిసిందే. సినిమాసినిమాకు మహేష్ బాబుకు క్రేజ్ పెరుగుతుండగా మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో ఒక సినిమాలో రాజమౌళి డైరెక్షన్ లో మరో సినిమాలో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలు పూర్తి కావాలంటే కనీసం మూడు సంవత్సరాల సమయం పట్టే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. అయితే మహేష్ రాబోయే రోజుల్లో లీడర్ సీక్వెల్ లో నటించే ఛాన్స్ అయితే ఉంది.

శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో రానా హీరోగా తెరకెక్కిన లీడర్ సినిమా ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే హిట్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా కమర్షియల్ గా మాత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించాలని శేఖర్ కమ్ముల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే లీడర్ సీక్వెల్ ను రానాతో కాకుండా మహేష్ తో తెరకెక్కించాలని శేఖర్ కమ్ముల భావిస్తున్నారు. శేఖర్ కమ్ముల కొన్ని సంవత్సరాల క్రితమే లీడర్ సీక్వెల్ కథను మహేష్ కు వినిపించారని బోగట్టా.

ఏవీఎం నిర్మాణ సంస్థకు చెందిన అరుణ గుహన్ తాజాగా మాట్లాడుతూ లీడర్ మూవీ సీక్వెల్ కు సంబంధించి గతంలో చర్చలు జరిగాయని చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో ఈ ప్రాజెక్ట్ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకునే ఛాన్స్ అయితే ఉందని ఆమె చెప్పుకొచ్చారు. లీడర్ సీక్వెల్ విషయంలో మహేష్ ఫ్యాన్స్ నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మహేష్ బాబు ఇప్పటికే కొరటాల శివ డైరెక్షన్ లో భరత్ అనే నేను సినిమాలో నటించారు. లీడర్ సీక్వెల్ లో మహేష్ నటిస్తే కచ్చితంగా ఆ సినిమాతో పోల్చి చూసే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. మహేష్ ఈ విషయంలో ఏ విధంగా ముందుకెళతారో చూడాల్సి ఉంది. మహేష్ బాబు తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సక్సెస్ లను సొంతం చేసుకొని సరికొత్త రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus