Sekhar Kammula: హాట్ టాపిక్ గా మారిన దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్!

దర్శకుడు శేఖర్ కమ్ముల తీసే సినిమాలు చాలా విభిన్నంగా ఉంటాయి. అలాగే సహజత్వానికి దగ్గరగా ఉంటాయి. సెన్సిటివ్ విషయాలను కూడా సెన్సిబుల్ గా చెప్పడం శేఖర్ కమ్ములకి మాత్రమే సాధ్యం అని అంతా అనుకుంటారు. అందుకే అతని సినిమాలకు యూనివర్సల్ అప్పీల్ సంతరించుకుంటుంది. ఇటీవల శేఖర్ కమ్ముల ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించిన ఎడ్యుకేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవానికి వెళ్లారు. అక్కడ తాను సినిమా తీసే విధానం గురించి, సినిమాని తాను చూసే కోణం గురించి చాలా గొప్పగా చెప్పారు.

శేఖర్ కమ్ముల (Sekhar Kammula) మాట్లాడుతూ.. ” సమాజానికి ఉపయోగపడే మంచి సినిమాలు వచ్చాయి. మన ప్రాంతం, మన దేశం అని కాకుండా ప్రపంచమంతా చూసే సినిమాలు వస్తున్నాయి. ఈరోజు మనం లేకున్నా రేపు మన సినిమాలు బతికే ఉంటాయి. సినిమా అనేది నా దృష్టిలో ఏంటంటే… సొసైటీలో చెడు ఉందని, అదే తీస్తున్నామంటారు కొంత మంది. సినిమాలు ఇట్లనే ఉంటాయంటారు. కానీ అది కరెక్ట్ కాదు. నువ్ సినిమా తీయాలి. కానీ చెడును సవరించేలా ఉండాలి.

మంచిని ప్రొత్సహించేలా ఉండాలి. సినిమా ద్వారా మంచి మార్పును తీసుకొచ్చేలా ఉండాలి. ఇదే విషయాన్ని నేను నా సినిమాల ద్వారా ప్రయత్నిస్తుంటాను. సినిమా అనేది యూనివర్శల్ గా ఉండాలి. న్యూయార్క్ లో భాష తెలియని వాడు కూడా చూస్తే అతనికి అర్థం కావాలి. సినిమాకు యూనివర్శల్ అప్పీల్ ఉండాలి. ఇవాళ తీసిన సినిమా మరో పదేళ్లైనా చూసేలా ఉండాలి.

పాత పడకూడదు. ఆది చూశాక గర్వపడేలా ఉండాలి. పిల్లలతో కలిసి చూసేలా ఉండాలి. కానీ ఇది ఎలా సాధ్యమంటే… సాధ్యమవుతుందని నేను నమ్ముతాను. అందుకే కిందిస్థాయి నుంచి ఆలోచించడం మొదలుపెట్టాలి. డాక్యుమెంటరీ, ఫిల్మ్ ఏది తీసినా, ఎక్కడ పోస్టు చేసినా దిగువ స్థాయిని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఎంపథితో చూడాలి. మనిషి-జంతువు వైపు ఆలోచిస్తే జంతువు తీసుకోవాలి.

పురుషుడు-స్త్రీ అంటే స్త్రీ వైపు ఆలోచించాలి. మన ఈగోలను పక్కనపెట్టి ఎంపథితో వెళ్లాలి. ఐన్ స్ట్రీన్ కూడా గాంధీని గొప్ప మనిషిగా భావిస్తాడు. అదే దారిలో నేను సినిమాలు తీస్తాను. అందుకే చాలా మంది నా సినిమాలను ఇష్టపడతారు. విద్యార్థులు మీరు ఏం కల కంటున్నారో వాటిని సాధించేందుకు కృషి చేస్తే గొప్పవాళ్లు అయినట్టే” అంటూ ఈ స్టార్ డైరెక్టర్ చెప్పుకొచ్చాడు.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus