ఇది కరెక్ట్ పద్ధతి కాదు బాబు గారూ..!

ఇటీవల జరిగిన ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)’ ఎన్నికల్లో శివాజీరాజీ ప్యానల్ పై నరేష్‌ ప్యానల్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. శివాజీ రాజా పై ఆయన 69 ఓట్ల ఆధిక్యంతో నరేష్ గెలుపొందడం జరిగింది. ఇక్కడ అసలు విషయాన్నీ పరిశీలిస్తే నరేష్ విజయంలో మెగాబ్రదర్ నాగబాబు కీలక పాత్ర పోషించాడని తెలుస్తుంది. అవును నరేష్ కు నాగబాబు సపోర్ట్ ఉందట. ఎన్నికలకు ముందే నాగబాబు ప్రెస్ మీట్ పెట్టి మరీ నరేష్ ప్యానల్ కు ఓటు వేయాలని కోరారు. దీంతో శివాజీ రాజా ఓడిపోవడానికి ఇదో కారణమని చెప్పుకోవచ్చు. ఈ విషయం శివాజీ రాజా అసంతృప్తికి లోనయ్యాడట.

తాజాగా ఇటీవల శివాజీ రాజా ఓ ప్రెస్ మీట్ పెట్టిన సంగతి తెలిసిందనే. శివాజీ రాజా ఇంకా పదవి పట్టుకునే వేలాడుతున్నారని… మమ్మల్ని ప్రమాణ స్వీకారం చేయకుండా అడ్డుకోవడానికి ఇలా మమ్మల్ని అడ్డుకుంటున్నారని నరేష్ ప్యానెల్ వారు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీనికరణంగానే మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఇక ఈ ప్రెస్ మీట్లో శివాజీ రాజా మాట్లాడుతూ… ‘నేను ఎవర్నీ అడ్డుకోవట్లేదని… నా పదవి గడువు మాత్రం మర్చి 30 వరకూ ఉందని చెప్పానని అయన చెప్పారు. ‘వృద్ధ కళాకారుల కోసం తానూ ఓ ఓల్డేజ్ హోమ్ ను కట్టాలని అనుకున్నానని… కానీ కొంతమంది దాని పై నీళ్ళు చల్లారని ఆరోపించారు. అదేవిధంగా ఫ్రెండ్ అనుకున్న నాగబాబు కూడా తనకు వ్యతిరేఖంగా ప్రెస్ మీట్ పెట్టి తనను విమర్శించడం బాగాలేదని… ఖచ్చితంగా త్వరలోనే తన నుండి నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ అందుతుందని శివాజీ రాజా తన ఆవేదన వ్యక్తం చేయడం ఇప్పుడు చర్చనీయాంశం’ అయ్యింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus