Archana, Jr NTR: ఆ హీరోయిన్ అంటే చాలా ఇష్టమంటున్న అర్చన!

సీనియర్ నటి అర్చన గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పాతికేళ్ల విరామం తర్వాత చోర్ బజార్ సినిమాలో అర్చన నటించారు. జీవన్ రెడ్డి డైరెక్షన్ లో ఆకాష్ పూరి, గెహనా సిప్పీ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ తో ప్రదర్శితమవుతోంది. నటి అర్చన ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సినిమాలను చూస్తుంటానని తెలుగు సినిమాలు చూడకుండా ఎలా ఉంటానని ఆమె కామెంట్లు చేశారు.

అన్ని సినిమాలు చూడకపోయినా కొన్ని సినిమాలు చూస్తానని ఆమె చెప్పుకొచ్చారు. సినిమాను పావుగంట, 20 నిమిషాల పాటు చూసి బాగుంది అనుకుంటే సినిమాను కంటిన్యూ చేస్తానని సినిమా నచ్చకపోతే చూడనని ఆమె అన్నారు. ఈ జనరేషన్ హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమని ఆమె కామెంట్లు చేశారు. హీరోయిన్లలో నయనతార బాగుంటుంది అని ఆమె చెప్పుకొచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమాలలో జనతా గ్యారేజ్ సినిమా అంటే చాలా ఇష్టమని ఆమె కామెంట్లు చేశారు.

ఆర్ఆర్ఆర్ సినిమాను ఇంకా చూడలేదని ఆమె చెప్పుకొచ్చారు. ఫస్ట్ ఇన్నింగ్స్, సెకండ్ ఇన్నింగ్స్ ను తాను నమ్మనని ఆమె అన్నారు. నా ప్రొఫెషన్ నన్ను ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉందని ఆమె తెలిపారు. నాకు ఆచితూచి సినిమాలు చేయడం అలవాటని ఆమె తెలిపారు. దర్శకుడు జీవన్ రెడ్డి తన పాత్ర చెప్పగానే వాస్తవానికి దగ్గరగా ఉన్న పాత్ర అని అర్థమైందని అర్చన కామెంట్లు చేశారు.

నా జానర్ దాటి బయటికొచ్చి ఈ సినిమాలో నటించానని ఆమె అన్నారు. నాకు మేకప్ అంటే ఇష్టం ఉండదని అయితే సినిమాలోని పాత్ర కోసం మేకప్ వేసుకోవాల్సి వచ్చిందని ఆమె కామెంట్లు చేశారు. చోర్ బజార్ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించకపోయినా అర్చన పాత్రకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus