ఎన్టీఆర్ మంచితనం గురించి చెబుతూ ఏడ్చిన సీనియర్ నటి

మహానటుడు నందమూరి తారకరామారావు మనవడు ఎన్టీఆర్ కూడా మహనీయుడు అవుతాడని అలనాటి నటి తులసి చెప్పారు. శంకరాభరణం తులసీగా పేరు తెచ్చుకున్న ఈమె కొన్ని రోజుల క్రితం శంకరాభరణం పేరిట అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ వేడుక కోసం తులసి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు. వాటిలో ఎన్టీఆర్ ప్రస్తావన రాగానే కన్నీరు పెట్టుకున్నారు. ‘‘ఎన్టీఆర్‌ తో నేను నటించలేదు. నేరుగా నేనింత వరకు చూసింది లేదు. అయినా ఎన్టీఆర్ అంటే నాకు చాలా ఇష్టం. నాకే కాదు.. నా కొడుకుకు కూడా. ఆయన్ను కలవడానికి వెళితే .. షూటింగ్ లో ముఖ్యమైన సీన్‌ను వదిలేసి మరీ నా కోసం వచ్చారు. నన్ను ఆయన రిసీవ్ చేసుకున్నారు. ‘అయ్యో అమ్మా.. మీకెందుకు అమ్మా.. నేను వస్తున్నాను’ అంటూ ఆయన నా దగ్గరకు వచ్చారు. అలా అన్నారు చూడండి .. అందుకే నాకు కళ్లలో నీళ్లు తిరిగాయి. అది చూసి ఆయన కళ్లు కూడా చెమర్చాయి.

“నాన్న..బాబు నాకు మీరు తెలియదు.. అయినా నా కోసం షూటింగ్ వదిలేసి మరీ మీరిలా వచ్చారు” అని అంటే.. మీకెందుకమ్మా నేనున్నాను అనే భరోసా ఇచ్చారు. కంట్లో ఆ తడి ఎందుకు రావాలమ్మా అని అన్నారు. అదే నన్ను బాగా కదిలించేసింది.” అని వివరించారు. ఇంకా తులసి  మాట్లాడుతూ ” ఎన్టీఆర్ గురించి నేను చాలా చోట్ల విన్నాను. ఆయన మాటిస్తే మాటే. చాలా పద్ధతి గల మనిషి. చాలా మంచి మనిషి. ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తారు. అని.. అవన్నీ కళ్లారా చూశాను. ఎన్టీఆర్ అన్ని విద్యలు తెలిసిన వ్యక్తి. ఆ అబ్బాయి ఇక్కడితో ఆగడు. మహనీయుడు అవుతాడు.   ఆయన ఒట్టి యాక్టర్‌గానే కాదు.. సమాజానికే ఓ స్ఫూర్తిగా నిలుస్తారు.” అని తన అభిప్రాయాన్ని చెప్పారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus