Jayasudha: ఎన్టీఆర్ జీవిత సాఫల్య పురస్కారం అందుకున్న నటి జయసుధ!

దివంగత నటుడు మాజీ ముఖ్యమంత్రి సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను పురస్కరించుకొని పలువురు సినీ సెలబ్రిటీలకు ఎన్టీఆర్ జీవిత సాఫల్య పురస్కారాలను అందిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఇదివరకే ఎంతోమంది సెలబ్రిటీలు ఎన్టీఆర్ జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు తాజాగా సహజనటి జయసుధకు సైతం ఎన్టీఆర్ జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించారు.ఎన్టీఆర్ ఏఎన్నార్ వంటి అగ్ర హీరోలందరి సరసన హీరోయిన్ గా తన సహజ నటనతో అందరిని మెప్పించిన

నటి జయసుధ ఇప్పటికీ వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈమె యంగ్ హీరో హీరోయిన్లకు తల్లిగా, అమ్మమ్మ నాన్నమ్మ పాత్రలలో నటిస్తూ సందడి చేస్తున్నారు. ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాలలో స్టార్ హీరోల సరసన నటించిన నటి జయసుధకు తాజాగా ఎన్టీఆర్ జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించారు.ఆదివారం రవీంద్రభారతిలో వంశీ ఇంటర్నేషనల్ సంస్థ ఆధ్వర్యంలో స్వర్గీయ ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను నిర్వహించారు. ఈ క్రమంలోనే నటి జయసుధను సత్కరించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా కేంద్రమంత్రి పి సుబ్బిరామిరెడ్డి పాల్గొన్నారు. ఆయన చేతుల మీదుగా జయసుధకు ఈ అవార్డును అందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ జయసుధ గారు తన సహజ నటనతో ప్రేక్షకుల మధ్యలో చెరగని ముద్ర సంపాదించుకున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏపీ మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి ఉద్ద ప్రసాద్, దర్శకులు ఏ కోదండరామిరెడ్డి, బి.గోపాల్, రేలంగి నరసింహారావు వైవిఎస్ చౌదరి వంటి తదితరులు పాల్గొన్నారు.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus