Rama Prabha : దయనీయంగా నటి రమాప్రభ పరిస్థితి.. ఆమె ఏమందంటే..!

తెలుగు,తమిళ భాషల్లో కమెడియన్ గా ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించిన రమాప్రభ.. ఒకప్పటి హీరో, విలక్షణ నటుడు అయిన శరత్ బాబుని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తరువాత అతని వల్ల మోసపోవడమే కాకుండా.. తాను సంపాధించుకున్న ఆస్తి మొత్తం పోగొట్టుకుందని.. ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. చివరికి కట్టుబట్టలతో రోడ్డునపడితే… రజినీ కాంత్ ఆదుకున్నారని కూడా ఈమె చెప్పుకొచ్చింది. అప్పటి రోజుల్లోనే తన దగ్గర ఉన్న రూ 40 వేలు ఇచ్చేసారట రజినీ.!

ఏదో దారి ఖర్చులు లేదా తినడానికి కొంతడబ్బు ఇస్తే చాలు అని రజినీ ఇంటికెళ్లిన రమా ప్రభకు… రజినీ అంత డబ్బు ఇవ్వడంతో షాక్ తిందట. రజినీ ఇప్పటికీ అదే విధంగా అందరికీ సాయం చేస్తుంటారని ఆమె చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా.. ఈమె సినిమాల్లో నటించే టైంలో తప్ప ఎక్కువగా హైదరాబాద్ లో ఉండటం లేదు అని కూడా ఈమె తెలిపింది. ఇక ఇటీవల.. ఈమె పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని..,

తినడానికి తిండి లేక పస్తులు ఉంటుందని..ఇలా రకరకాల వార్తలు వినిపించాయి. అయితే ఇందులో ఎంత మాత్రం నిజం లేదని రమా ప్రభ చెప్పుకొచ్చింది. ‘నేను అడుక్కు తింటున్నానని చాలామంది ప్రచారం చేస్తున్నారు. నా సొంత యూట్యూబ్ ఛానల్ లో నా ఇల్లు ఎలా ఉంటుందో చూపించాను.నేను బిజీగా పని చేస్తున్నప్పుడు ఎలా అడుక్కుతింటాను.

నాగార్జున, పూరీ వంటివారు నాకు ఇప్పటికీ సాయం చేస్తున్నారు. వాళ్ళు తన ఇంట్లో మనిషి అనుకుని నాకు సాయం చేస్తున్నారు. కాబట్టి అది కూడా అడుక్కుతింటున్నట్టు కాదు కదా..! నా పై ప్రేమగా ఇస్తున్నారు కాబట్టి.. నేను అందరి కంటే రిచ్ అని భావిస్తాను’ అంటూ చెప్పుకొచ్చింది.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus