సీనియర్ నటి రమప్రభ అల్లుడు ఆ టాలీవుడ్ హీరోనే..!

‘అదుర్స్’ సినిమాలో నయన తార తల్లిగా నటించి అలరించిన రమప్రభ.. 90లలో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించిందన్న సంగతి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. సీనియర్ స్టార్ కమెడియన్ రాజబాబుకి జోడీగా ఈమె 300లకు పైగా సినిమాల్లో నటించింది. ఎన్టీఆర్, ఏ.ఎన్.ఆర్, కృష్ణ, శోభన్ బాబు వంటి ఎంతో మంది అగ్ర హీరోల సినిమాల్లో ఈమె నటించింది. ఆ టైములోనే ప్రముఖ నటుడు శరత్ బాబుని ప్రేమించి పెళ్లి చేసుకుంది రమ ప్రభ.

13 ఏళ్ళ పాటు వీరు బాగానే కలిసున్నారు. కానీ ఆ తరువాత వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. ఇక అప్పటినుండీ ఈమె మదనపల్లిలోనే ఉంటూ వస్తోంది. సినిమాల కోసం మాత్రమే హైదరాబాద్ కు వచ్చి వెళ్తుంటుందట. ఇదిలా ఉండగా.. ఈమె అల్లుడు ఎవరు అన్న సంగతి ఇప్పటి వరకూ చాలా మందికి తెలిసి ఉండదు. ఆ విషయం తెలుస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే.! అతనెవరో కాదు.. మన నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారే..! వివరాల్లోకి వెళితే..రమ ప్రభ తన అక్క కూతురు అయిన విజయ చాముండేశ్వరిని ఎప్పుడో దత్తత తీసుకుందట.

ఈమెనే రాజేంద్ర ప్రసాద్ కు ఇచ్చి పెళ్లి చేసిందట. ఈ విషయాల్ని రమ ప్రభనే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అంతేకాదు ‘మా అసోసియేషన్’ వల్ల ఈమె ఎన్నో అవమానాలను కూడా ఎదుర్కొందట. తన అల్లుడు రాజేంద్ర ప్రసాద్.. ‘మా అసోసియేషన్’ ప్రెసిడెంట్ గా ఉన్నప్పటికీ అవమానాలు ఫేస్ చెయ్యాల్సి వచ్చినట్టు కూడా చెప్పి కంటతడి పెట్టుకుంది రమప్రభ .

Most Recommended Video

‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ హీరోయిన్ రూప గురించి మనకు తెలియని విషయాలు..!
పోకిరి మూవీలో పూరిజగన్నాథ్ సోనూసూద్ నీ హీరోగా అనుకున్నాడట!
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus