సీనియర్ హీరోయిన్ సుమలత ఎమోషనల్ కామెంట్స్..!

సుమలత అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి వంటి స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటించి ఆకట్టుకుంది.ఈ కూడా స్టార్ స్టేటస్ ను సంపాదించుకుని ఓ వెలుగు వెలిగింది కూడా..! నిజానికి ఈమె తెలుగింటి అమ్మాయే అయినప్పటికీ.. కన్నడ స్టార్ హీరో అంబరీష్‌ను వివాహం చేసుకుని అక్కడ సెటిల్ అయ్యింది. 1991లో సుమలత, అంబరీష్ ల వివాహం జరిగింది. వీళ్ళు ఆదర్శమైన జంటగా కనిపించేవారు. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే అనూహ్యంగా 2018లో అంబరీష్ మరణించాడు. దీంతో సుమలత చాలా బాధపడుతున్నట్టు కూడా కనిపిస్తుంది. ఈమధ్యనే కరోనాతో ఫైట్ చేసి గెలిచిన సుమలత.. తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఎమోషనల్ కామెంట్స్ చెయ్యడం చర్చనీయాంశం అయ్యింది. నవంబర్‌ 24వ తేదీన అంబరీష్ మరణించి రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో సుమలత ఇలా ఎమోషనల్ కామెంట్స్ చేసినట్టు స్పష్టమవుతుంది.

సుమలత మాట్లాడూతూ.. “కళ్లు మూసి ఉంచగలను.. చెవులను కూడా మూయగలను, కానీ నా హృదయాన్ని మూయలేను. దానికి కారణం.. ఒక అనంతమైన ప్రేమ, ఒక అపూర్వమైన శక్తి, ఎన్నో జ్ఞాపకాలు దాగి ఉన్న హృదయం నాది. రెండేళ్లు మీరు లేకుండా గడిచిపోయాయి. మీతో గడిపిన ప్రతి క్షణం ఎంత విలువైనదో తలుచుకుని బాధపడుతూనే ఉంటాను. మనం కలిసి గడిపిన ఆ తీయని క్షణాలు, జ్ఞాపకాలు, నవ్వులు, ప్రేమ.. అన్నీ అపూర్వమైనవి. క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు.. నాకు ధైర్యం చెప్పి నా చెయ్యి పట్టుకుని మీరు నడిపించిన క్షణాలు, మీరు నింపిన ఆత్మవిశ్వాసం, నింపిన ధైర్యం, చీకటి క్షణాల్లో నింపిన నమ్మకం, ప్రేమ, వదిలి వెళ్లిన వారసత్వం.. ఇవన్నీ నేను ఎప్పటికీ మరిచిపోలేను. మీరు లేకుండా నన్ను ముందుకు నడిపిస్తున్నవి అవే..! మీ మంచితనమనే వెలుగు.. జీవితంలో నాకెదురయ్యే కష్టాల నుండీ బయటపడేస్తున్నాయి.

నా చివరి శ్వాస వరకూ మీరు ఉంటారు…నా నవ్వు, నా ఏడుపు అన్నింట్లోనూ ఉంటారు…నేను పడిపోయినా, తడబడినా మీ అనంతమైన బలం నన్ను నిలబడేలా చేస్తుందని నాకు తెలుసు…ఇప్పుడు బతికి ఉన్నది నేను కాదు..నా ద్వారా బతికి ఉన్నది మీరే.. మళ్లీ మనం ఒక్కటయ్యేవరకూ నా హృదయాన్ని పదిలంగా పట్టుకునే ఉండండి.. నన్ను బలంగా ఉంచండి’’ అంటూ తన భర్త పై ఉన్న ప్రేమను చెప్పుకొచ్చింది సుమలత.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus