Sumalatha: హీరోయిన్ సుమలత ఇంట్లో పెళ్లి భాజాలు..మూడు ముళ్ల బంధంలోకి సుమలత కోడుకు!

తెలుగింటి ఆడపడుచు, ప్రముఖ నటి సుమలత స్యాండిల్ వుడ్ రెబల్ స్టార్ అంబరీష్ ను ప్రేమ వివాహం చేసుకుంది. అంబరీష్ ఎమ్మెల్యేగా, ఎంపీగా విజయం సాధించారు. కేంద్ర మంత్రిగా, కర్ణాటక రాష్ట్ర మంత్రిగా పని చేసిన అంబరీష్ రాజకీయాల్లో కూడా ఆయన సత్తాచాటుకున్నారు. సుమలతా అంబరీష్ కూడా గత లోక్ సభ ఎన్నికల్లో మండ్య నియోజక వర్గం నుంచి స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ సీఎం హెచ్ డీ. కుమారస్వామి కుమారుడు, ప్రముఖ హీరో నిఖిల్ కుమారస్వామిని చిత్తుచిత్తుగా ఓడించి ఎంపీ అయ్యారు.

భర్త అంబరీష్ అడుగుజాడాల్లో సుమలతా కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. అయితే గతం సంవత్సం డిసెంబర్ 22న సుమలత, అంబరీష్ ఏకైక కుమారుడు నటుడు అభిషేక్ అంబరీష్ కు అవివా బిద్దప్ప అనే ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ కు ఘనం నిశ్చితార్ధం జరిగిన విషయం అందరికి తెలిసిందే.. వీరు గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి అభిషేక్ అంబరీష్, అవివా బిద్దప్ప ప్రేమించుకుంటున్నారు. నిశ్చతార్ధం జరిగి సంవత్సరం అవుతోంది. అటు అభిషేక్ అంబరీష్ సినిమాలో, సుమలత అంబరీష్ రాజకీయాల్లో మరియు సినిమాల్లో బీజీగా ఉండటం వల్ల పెళ్లి ఇన్ని రోజులు వాయిదా వేశారని సమాచారం.

ఇప్పుడు కొంచెం ఫ్రీకావడంతో పెళ్లి పనులు ఊపందుకున్నాయి. ఈ రోజు నుండి అంటే జూన్ 5వ తేదీ బెంగళూరు ప్యాలెస్ గ్రౌండ్స్ లో అభిషేక్ అంబరీష్, అవివా బిద్దప్పల వివాహ వేడుకలు గ్రాండ్ గా ప్రారంభమైయ్యాయి. ఈ వేడుకలో ప్రముఖ రాజకీయనాయులు, సినిమాతారలు హాజరు అవుతున్నారు. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి. రామ్ చరణ్ కూడా హాజరైయ్యారు.

ఈ వివాహానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కర్ణాటక సీఎం సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, మాజీ సీఎంలు బీఎస్. యడియూరప్ప, బసవరాజ్ బోమ్మయ్, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు స్యాండిల్ వుడ్ కు చెందిన ప్రముఖ నటీనటులు అందరూ సుమలతా అంబరీష్ కుమారుడి పెళ్లికి హాజరు అవుతున్నారని తెలిసింది.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus