Pawan Kalyan: పవన్ చేసింది తప్పేనంటున్న సీనియర్ జర్నలిస్ట్..?

కొన్ని సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ పై చేయి చేసుకున్నారనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ చేతిలో చెంపదెబ్బలు తిన్న ఆ ఫిలిం జర్నలిస్ట్ ఎం డి అబ్దుల్ తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్య్వూలో అబ్దుల్ మాట్లాడుతూ ఆ ఘటనకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. పవన్ కళ్యాణ్ తనను కొట్టడం వల్ల తనకు మంచి జరిగిందో చెడు జరిగిందో తెలియదని అబ్దుల్ అన్నారు.

మెగా ఫ్యామిలీలో నిశ్చితార్థ ఈవెంట్ జరగగా ఆ ఈవెంట్ కు మొదట మా ఫోటో గ్రాఫర్ వెళ్లారని పవన్ కళ్యాణ్ ఫోటోగ్రాఫర్ పై చేయి చేసుకోవడంతో పాటు కెమెరా లాక్కున్నారని అబ్దుల్ పేర్కొన్నారు. ఫోటోగ్రాఫర్ అనుమతి లేకపోయినా వెళ్లడం వల్ల ఆ విధంగా జరిగిందని అబ్దుల్ తెలిపారు. ఆ తరువాత తాను రిపోర్టర్ తో కలిసి ఈవెంట్ జరుగుతున్న ప్రదేశానికి కొంతదూరంలో చెట్టు దగ్గర ఉన్నానని తన పక్కన ఉన్న ఫోటోగ్రాఫర్ ను చూసి వచ్చిన పవన్ కళ్యాణ్ ఎందుకు వచ్చావు..? అని అడగగా కవరేజ్ కోసం వచ్చానని తాను చెప్పానని వద్దంటే వెళ్లిపోతాను కదా అని తాను పవన్ తో అన్నానని అబ్దుల్ చెప్పారు.

పవన్ నన్ను చెంపదెబ్బ కొట్టాలని ప్రయత్నిస్తే మోచేయి అడ్డం పెట్టుకున్నానని ఆ సమయంలో తాను స్లిప్ అయ్యి కింద పడ్డానని అబ్దుల్ అన్నారు. పవన్ కళ్యాణ్ చేతిలో తనకు దెబ్బలైతే పడ్డాయని అబ్దుల్ వెల్లడించారు. ఆ తరువాత కొట్టమని పవన్ సెక్యూరిటీకి చెప్పి అక్కడినుంచి వెళ్లిపోయారని కానీ తాను జర్నలిస్ట్ నని చెప్పడంతో సెక్యూరిటీ సైలెంట్ అయ్యారని అబ్దుల్ తెలిపారు. ఆ తరువాత కేసు పెట్టామని చంద్రబాబు జోక్యంతో వివాదం సద్దుమణిగిందని అబ్దుల్ వెల్లడించారు. పవన్ కళ్యాణ్ బయట ఉన్న తనపై చేయి చేసుకోవడం తప్పేనని అబ్దుల్ పేర్కొన్నారు.


ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus