సీనియర్ హీరోలలో ఒకరైన రాజశేఖర్ (Rajasekhar) ఈ మధ్య కాలంలో పరిమితంగా సినిమాలలో నటిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఆయన నటించిన శేఖర్, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ (Extra Ordinary Man) సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాలను అందుకోలేదు. శేఖర్ మూవీ పలు వివాదాలలో చిక్కుకోవడం వల్ల ఈ సినిమా ఏ ఓటీటీలో సైతం అందుబాటులో లేదనే సంగతి తెలిసిందే. అయితే 70 కోట్ల రూపాయల బడ్జెట్ తో రాజశేఖర్ హీరోగా ఒక ప్రాజెక్ట్ తెరకెక్కుతోందని తెలుస్తోంది.
నిఖిల్ తో (Nikhil) స్పై (Spy) సినిమా తెరకెక్కించిన గ్యారీ (Garry) డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కనుందని అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాను నిర్మించనుందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ లో మరో ఇద్దరు యంగ్ హీరోలు సైతం నటిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. సాధారణంగా అమెజాన్ వెబ్ సిరీస్ లను మాత్రమే నిర్మిస్తుంది. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఒకింత కన్ఫ్యూజన్ నెలకొనగా అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. హీరో రాజశేఖర్ సినిమాకు 70 కోట్ల రూపాయల బడ్జెట్ రిస్క్ అయినా కంటెంట్ అద్భుతంగా ఉంటే మాత్రం ఎక్కువ మొత్తం ఖర్చు చేయవచ్చు.
రాజశేఖర్ సైతం కథల, పాత్రల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో రాజశేఖర్ కెరీర్ పరంగా సక్సెస్ కావాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. రాజశేఖర్ విలన్ రోల్ లో నటిస్తే కెరీర్ పుంజుకుంటుందని ఫ్యాన్స్ చెబుతున్నారు. రాజశేఖర్ కు హీరోగా అవకాశాలు తగ్గి ఉండొచ్చు కానీ ఆయన పారితోషికం మాత్రం భారీ స్థాయిలోనే ఉంది. ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాకు రాజశేఖర్ 5 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నారని వార్తలు వచ్చాయి.
గెస్ట్ రోల్ కు రాజశేఖర్ ఆ రేంజ్ లో తీసుకుంటే ఫుల్ లెంగ్త్ రోల్ కు ఏ రేంజ్ లో తీసుకుంటారో చూడాలి. స్పై ఆశించిన ఫలితాన్ని అందుకోకపోయినా 70 కోట్ల రూపాయల బడ్జెట్ తో సినిమా ప్లాన్ చేస్తున్నారంటే గ్యారీ గ్రేట్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.