టాలీవుడ్ స్టార్ హీరోలలో చాలామంది హీరోలు ప్రస్తుతం రెండేళ్లకు ఒక సినిమాలో మాత్రమే నటిస్తున్నారు. వరుసగా ప్రాజెక్ట్ లు సక్సెస్ కావాలనే ఆలోచనతో హీరోలు ఈ విధంగా చేస్తున్నారని సమాచారం అందుతోంది. అయితే యంగ్ జనరేషన్ స్టార్ హీరోల కన్నా సీనియర్ హీరోలే బెటర్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. చిరంజీవి, బాలకృష్ణ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. సీనియర్ హీరో నాగార్జున నటించిన బంగార్రాజు, బ్రహ్మాస్త్రం ఇప్పటికే విడుదల కాగా ది ఘోస్ట్ మూవీ త్వరలో రిలీజ్ కానుంది.
జూనియర్ ఎన్టీఆర్, చరణ్, బన్నీ నటిస్తున్న సినిమాలు వచ్చే ఏడాది ఇదే సమయానికి రిలీజ్ కావడం కష్టమేనని తెలుస్తోంది. ఈ హీరోల తర్వాత ప్రాజెక్ట్ ల షూటింగ్ లు ఎప్పటికి పూర్తవుతాయో క్లారిటీ రావాల్సి ఉంది. ప్రభాస్ వేగంగానే సినిమాలలో నటిస్తున్నా ఆ సినిమాలన్నీ భారీ బడ్జెట్ సినిమాలు కావడంతో ఆ సినిమాలు రిలీజ్ కావడం అంతకంతకూ ఆలస్యం అవుతుండటం గమనార్హం. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు కూడా నిదానంగానే సినిమాల్లో నటిస్తుండటం గమనార్హం.
వాస్తవానికి చరణ్, తారక్, ప్రభాస్, మహేష్, పవన్, బన్నీ సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. ఈ హీరోలు వేగంగా సినిమాలలో నటిస్తే ఇండస్ట్రీకి మేలు జరుగుతుంది. ప్రస్తుతం థియేటర్ల పరిస్థితి అస్సలు బాలేదనే సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో పెద్ద సినిమాలు వేగంగా రిలీజైతే మాత్రమే ఇండస్ట్రీకి బెనిఫిట్ కలుగుతుందని చెప్పవచ్చు.
టాలీవుడ్ హీరోలు ఈ దిశగా అడుగులు వేయాల్సి ఉంది. సీనియర్ హీరోలు వేగంగా సినిమాలలో నటిస్తున్నా సినిమాలకు హిట్ టాక్ వస్తే మాత్రమే రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయి. కరోనా వల్ల టాలీవుడ్ యంగ్ జనరేషన్ స్టార్ హీరోలు కోట్ల రూపాయలు నష్టపోయారు. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలు వరుసగా సినిమాలలో నటిస్తే కెరీర్ పరంగా ఊహించని స్థాయిలో బెనిఫిట్ కలుగుతుందని చెప్పవచ్చు.
Most Recommended Video
శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!