ఈరోజుల్లో ఓ స్టార్ సినిమా సూపర్ హిట్ అయితే అన్ని లెక్కలూ బయటకి వస్తాయి.. బడ్జెట్, బిజినెస్, కలెక్షన్స్, రికార్డ్స్, టీజర్, ట్రైలర్ వ్యూస్, టీఆర్‌పీ రేటింగ్స్.. ఇలా ప్రతి విషయానికి సంబంధించిన అప్‌డేట్స్ అన్నీ తెలిసిపోతుంటాయి.. ఎందుకంటే ఫ్యాన్స్‌తో పాటు నార్మల్ ఆడియన్స్ కూడా అలాంటి ట్రెండింగ్ టాపిక్స్ తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.. ఇప్పుడు మీడియా, సోషల్ మీడియా ఎంత అప్‌డేట్‌గా ఉన్నాయో తెలిసిందే కదా.. ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాతి తరానికి చెందిన మెగాస్టార్ చిరంజీవి, యువరత్న బాలకృష్ణ, యువసామ్రాట్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ టైంలో కలెక్షన్స్, సెంటర్స్, డేస్ లాంటి రికార్డులుండేవి..
ఒకర్ని మించి ఒకరు పోటీ పడేవారు.. ఇప్పుడు సీనియర్స్ అయిపోయినా కానీ యంగ్ జెనరేషన్‌కి గట్టి పోటీనిచ్చేలా సినిమాలు చేస్తున్నారు. ఇప్పటి సూపర్ స్టార్లతో కంపేర్ చేయడం కాదు కానీ రీసెంట్‌గా ఈ నలుగురు సీనియర్ల చిత్రాల్లో టెలివిజన్ ప్రీమియర్‌లో రీసెంట్‌గా హయ్యస్ట్ టీఆర్‌పీ సాధించిన మూవీస్ ఏంటో తెలుసుకుందాం.. కింగ్ నాగార్జున, తనయుడు యువసామ్రాట్ నాగ చైతన్యతో కలిసి నటించిన చిత్రం ‘బంగార్రాజు’.. ‘సోగ్గాడే చిన్నినాయనా’ ప్రీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీ 14 టీఆర్‌పీ తెచ్చుకుని టాప్‌లో ఉంది..
తర్వాత నటసింహ నందమూరి బాలకృష్ణ, ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుల కలయికలో వచ్చిన హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ ‘అఖండ’ 13.31 రేటింగ్ సాధించింది.. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి ‘ఎఫ్ 2’ కి సీక్వెల్‌గా చేసిన ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఎఫ్ 3’.. టెలివిజన్ ప్రీమియర్ ద్వారా ఈ చిత్రం 8.26 టీఆర్‌పీతో సరిపెట్టుకుంది.. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన మెగా మల్టీస్టారర్ ‘ఆచార్య’ ..
స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేయగా భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా రిజల్ట్ ఏంటనేది తెలిసిందే.. థియేటర్లలోనే సరిగా చూడలేదు, ఇంకా టీవీలో ఎవరు చూస్తారులే అనుకున్నారు కానీ.. ‘ఆచార్య’ కి 6.30 టీఆర్‌పీ రేటింగ్ వచ్చింది..