ఆ హీరో తలుపు తీయమని గొడవ చేశాడట.. ఏమైందంటే?

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని చాలామంది భావిస్తారు. ఇండస్ట్రీలో జరిగిన కొన్ని ఘటనల వల్ల క్యాస్టింగ్ కౌచ్ కు సంబంధించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. సీనియర్ నటీమణులలో ఒకరైన వెన్నిరాడై నిర్మల తెలుగుతో పాటు ఇతర భాషల్లో సినిమాలలో నటించి మంచి పేరును సంపాదించుకున్నారు. సౌత్ ఇండియాలో 400కు పైగా సినిమాలలో నటించిన నటీమణులలో నిర్మల ఒకరు. 1967 సంవత్సరం నుంచి ఇప్పటివరకు నిర్మల సినిమాల్లో యాక్టివ్ గానే ఉన్నారు.

శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో చిరంజీవి తల్లి పాత్రలో నటించి నిర్మల ఆకట్టుకున్నారు. తన నటనతో నిర్మల విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుని వార్తల్లో నిలిచారు. ఒక ఇంటర్వ్యూలో నిర్మల మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు. కెరీర్ పరంగా ఎదురైన చెడు అనుభవాల గురించి ఆమె పేర్కొన్నారు. ఒకరోజు షూటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చానని ఆమె అన్నారు.

ఆ మూవీలో నటించిన హీరో నా ఇంటికి అర్ధరాత్రి తాగి వచ్చి తలుపు తట్టాడని నిర్మల కామెంట్లు చేశారు. ఆ సమయంలో నేను డోర్ ఓపెన్ చేయలేదని ఆమె అన్నారు. ఆ హీరో తలుపు కొడుతూనే ఉన్నాడని ప్లీజ్ డోర్ చేయాలని అరిచాడని నిర్మల చెప్పుకొచ్చారు. నేనేం చేయనని కేవలం మీ పక్కన వచ్చి నిద్రపోతా అని ఆ హీరో అన్నాడని నిర్మల కామెంట్లు చేశారు.

ఆ తర్వాత నేను ఆ సినిమా చేయనని చెప్పానని నిర్మల తెలిపారు. ఆ తర్వాత నుంచి నేను షూటింగ్ లకు వెళ్లలేదని ఆమె చెప్పుకొచ్చారు. డైరెక్టర్, ప్రొడ్యూసర్ నన్ను ఒప్పించడానికి ప్రయత్నించినా నేను మాత్రం అంగీకరించలేదని నిర్మల వెల్లడించారు. నా వల్ల కాదని చెప్పి నేను ఆ సినిమా నుంచి తప్పుకున్నానని ఆమె పేర్కొన్నారు. నిర్మల వెల్లడించిన విషయాలు హాట్ టాపిక్ అవుతున్నాయి.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus