టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస విజయాలను సొంతం చేసుకుంటున్న వాళ్లలో సీనియర్ నరేష్ ఒకరు. సీనియర్ నరేష్ సినిమాకు ప్లస్ కావడంతో పాటు సినిమాల సక్సెస్ లో కీ రోల్ పోషిస్తున్నారు. తాజాగా నరేష్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో పాటు హాట్ టాపిక్ అవుతున్నాయి. నన్ను చాలామంది చిన్నచూపు చూశారని నరేష్ చెప్పుకొచ్చారు. సినిమాల విషయంలో నా ఆకలి ఇంకా తీరలేదని నరేష్ పేర్కొన్నారు.
తుది శ్వాస ఉన్నంత వరకు నటుడిగా కెరీర్ ను కొనసాగిస్తానని ఆయన అన్నారు. పండంటి కాపురం మూవీతో కెరీర్ మొదలైందని నేనెప్పుడూ మంచి నటుడిగానే ఉండాలని అనుకున్నానని నరేష్ కామెంట్లు చేశారు. ప్రస్తుతం క్యారవాన్ సంస్కృతి తప్పనిసరి అయిందని సీనియర్ నరేష్ వెల్లడించారు. సెట్ లో నటీనటుల మధ్య మంచి బంధం ఉంటే అది తెరపై ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు 250కు పైగా సినిమాలు చేశానని నరేష్ తెలిపారు.
సామజవరగమన సినిమాతో నరేష్ (Naresh) వెర్షన్ 2.0 మొదలైందని కామెంట్లు వినిపిస్తున్నాయని నరేష్ చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీలోని సీనియర్ స్టార్స్ అంతా కలిసి ముందడుగు వేస్తే మా భవనం పూర్తి చేయడం కష్టం కాదని ఆయన పేర్కొన్నారు. సినిమా ఇండస్ట్రీని వదిలేయాలని అనుకోలేదని నరేష్ వెల్లడించారు. సినిమా ఇండస్ట్రీలోని కొంతమంది ప్రత్యర్థులు నాపై దుష్ప్రచారం చేశారని సీనియర్ నరేష్ పేర్కొన్నారు.
నా వాళ్లు ఎవరో బయటి వాళ్లు ఎవరో ఆ సమయంలోనే నాకు అర్థమైందని నరేష్ పేర్కొన్నారు. నేను చూసిన రాజకీయ జీవితం నన్ను ధైర్యంగా ముందుకు నిలబడేలా చేసిందని ఆయన పేర్కొన్నారు. నరేష్ చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి. సీనియర్ నరేష్ రెమ్యునరేషన్ ప్రస్తుతం భారీ స్థాయిలోనే ఉందని తెలుస్తోంది.