సీనియర్ ఎన్టీఆర్ ఏ పాత్రలో నటించినా ఆ పాత్రతో ఆయనకు ప్రశంసలు దక్కాయే తప్ప విమర్శలు ఎప్పుడూ వ్యక్తం కాలేదు. దర్శకులకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చే అతికొద్ది మంది హీరోలలో సీనియర్ ఎన్టీఆర్ ఒకరు కావడం గమనార్హం. వెండితెరకు సార్వభౌముడైన సీనియర్ ఎన్టీఆర్ ఎంతోమందికి మార్గదర్శకుడిగా నిలిచి సంచలన విజయాలను సొంతం చేసుకున్నారు. కాలేజ్ లో చదివే రోజుల్లో రాచమల్లుని దౌత్యం అనే నాటకంలో స్త్రీ పాత్రలో నటించి సీనియర్ ఎన్టీఆర్ ప్రశంసలు పొందారు.
కథ నచ్చితే కొన్ని సినిమాలలో సీనియర్ ఎన్టీఆర్ డీ గ్లామర్ రోల్స్ లో నటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాత తరహా పాత్రల్లో నటించి నటుడిగా తాను ఏ పాత్రనైనా ఛాలెంజ్ గా తీసుకొని చేస్తానని సీనియర్ ఎన్టీఆర్ ప్రూవ్ చేసుకున్నారు. ఆకలి విలువ తెలిసిన కుటుంబం నుంచి వచ్చిన సీనియర్ ఎన్టీఅర్ కరువు కోరల్లో అల్లాడిన బాధితులను ఆదుకునే విషయంలో ముందువరసలో ఉండేవారు. అయితే సీనియర్ ఎన్టీఆర్ ఖాతాలో చెక్కుచెదరని ఒక రికార్డ్ ఉంది.
ఒకే ఏడాదిలో సీనియర్ ఎన్టీఆర్ నటించిన మూడు సినిమాలు ఇండస్ట్రీ హిట్లుగా నిలవడం గమనార్హం. ఈతరం హీరోలలో చాలామంది హీరోలు పదేళ్లకు ఒక ఇండస్ట్రీ హిట్ సాధించడంలో ఫెయిల్ అవుతున్నారు. 1977 సంవత్సరం సీనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో ప్రత్యేకం అని చెప్పాలి. ఆ ఏడాది విడుదలైన దానవీర శూరకర్ణ, అడవి రాముడు, యమగోల సినిమాలు కలెక్షన్ల విషయంలో రికార్డులు క్రియేట్ చేశాయి.
ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు. సీనియర్ ఎన్టీఆర్ నటనను అభిమానించే అభిమానులు ఈ జనరేషన్ లో కూడా ఉన్నారు. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ నందమూరి హీరోలుగా ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నారు. ఈ హీరోలు నటించిన సినిమాలలో కొన్ని సినిమాలు సంచలన విజయాలను సొంతం చేసుకోవడం గమనార్హం.
Most Recommended Video
పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!