కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ వల్ల గత కొన్ని రోజులుగా వరుసగా సీనియర్ సినీ సెలబ్రిటీలు మృతి చెందుతున్న సందర్భాలను మనం చూస్తూనే వస్తున్నాం. వారిలో కరోనా లక్షణాలు త్వరగా బయటపడక పోవడం వలన పరిస్థితి విషమించి మృతి చెందుతున్నారు అని వైద్య నిపుణులు చెప్పుకొస్తున్నారు. వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ కొందరు మరణిస్తుండడం మరింత కలవరపరిచే విషయం. తాజాగా.. సుప్రసిద్ద గాయకుడు మరియు సంగీత దర్శకుడు అయిన శ్రీ జి.ఆనంద్ గారు కూడా మరణించడం సినీ ఇండస్ట్రీని కుదిపేసింది!
అవును కూడా ఆయన కరోనాతో మరణించారు! మూడు రోజుల నుండీ కొద్దిపాటి కరోనా లక్షణాలు ఉండటంతో చికిత్స పొందుతూ వచ్చిన ఆయనకు.. నిన్న సాయంత్రం నుండీ శ్వాస సమస్య మొదలయ్యింది ! వారు నివసించేది గాంధీ నగర్ లో ! ప్రయత్నించగా హస్తినాపురంలో వెంటిలేటర్ సౌకర్యం దొరికింది! కానీ చివరికి ఆయన ప్రాణం మాత్రం నిలబడలేదు. 1976 లో వచ్చిన ‘అమెరికా అమ్మాయి’ అనే సినిమాలో ‘ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక’ అనే పాటతో ఈయన సినీ కెరీర్ ప్రారంభమైంది.
‘ప్రాణం ఖరీదు’, ‘మనవూరి పాండవులు’, ‘మా బంగారక్క’, ‘చక్రధారి’, ‘తాయారమ్మ -బంగారయ్య’ ‘కల్పన’, ‘ఆమె కథ’ వంటి చిత్రాల్లో పాటలు పాడారు. ‘గాంధీ నగర్ రెండోవీధి’ ‘స్వాతంత్రానికి ఊపిరి పోయండి’, ‘అంబేద్కర్, రంగవల్లి’ వంటి సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించారు జి. ఆనంద్.ఇక జి. ఆనంద్ మృతి పట్ల తెలుగు సినీ సంగీత దర్శకులు, గాయనీ గాయకులు అలాగే మెగాస్టార్ చిరంజీవి వంటి స్టార్ హీరోలు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు.