నో పెయిన్.. నో గైన్ అనే ఆంగ్ల సామెత లాగా.. కష్టంలేనిదే ఏ విజయం సాధించలేము. ప్రపంచమంతా జేజేలు అందుకుంటున్న బాహుబలి చిత్రం కోసం రాజమౌళి తో పాటు ప్రభాస్ నాలుగేళ్లు శ్రమించారు. డార్లింగ్ పడిన కష్టం గురించి ఆయన ఫిజికల్ ట్రైనర్ లక్ష్మారెడ్డి తాజాగా బయట పెట్టారు. ఈ బాడీ బిల్డర్ పర్యవేక్షణలో ప్రభాస్ తన బాడీని శిల్పంలా మలుచుకున్నారు. ఇందుకోసం యంగ్ రెబల్ స్టార్ డెడికేషన్ చూసి లక్ష్మారెడ్డి షాక్ తిన్నాడంట. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడుతూ… “బాహుబలి సినిమా కోసం ప్రభాస్ తీసుకునే ఆహారం, వర్కౌట్స్ అన్నినా పర్యవేక్షణలో జరిగాయి. నాలుగేళ్ళ పాటు అతినితో కలిసి ప్రయాణించాను. బాహుబలిలో రెండు పాత్రల్లో వేరియేషన్ కనిపించడానికి డైట్, వర్కవుట్ సూచించాను. వాటిని చక్కగా పాటించారు.
అమరేంద్ర బాహుబలి పాత్రకోసం చీజ్, మటన్ వంటి ఆహారాన్ని ఎనిమిది సార్లు అందించాను. అలాగే మహేంద్ర బాహుబలి సిక్స్ ప్యాక్ కోసం ఎగ్ వైట్, చికెన్, నట్స్, అల్మండ్స్, చేపలు, కూరగాయలు వంటి వాటిని ఆరు సార్లు ఆహారంగా ఇచ్చాను” అని వివరించారు. బరువు పెరగడం, తగ్గే క్రమంలో కొన్ని సమస్యలు ఎదురైనా, ప్రభాస్ ధైర్యం, పట్టుదలతో వాటిని అధిగమించారని లక్ష్మారెడ్డి వివరించారు. అతని కృషికి తగ్గ ఫలితం లభించినందుకు సంతోషంగా ఉందని తెలిపారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.